ఊగిసలాటలో స్టాక్‌ మార్కెట్‌.. 60 వేల దిగువకి సెన్సెక్స్‌

Daily Stock Market Updates In Telugu - Sakshi

ముంబై : స్టాక్‌ మార్కెట్‌లో కరెక్షన్‌ కొనసాగుతోంది. దీంతో మారోసారి దేశీ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం బీఎస్‌ఈ సెన్సెక్స్‌, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీలు లాభాలతోనే ప్రారంభమైనా అది కొద్ది సేపే కొనసాగింది. ఆ వెంటనే  నష్టాల దిశగా సూచీలు మళ్లాయి.

ఈ రోజు ఉదయం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 61,398 పాయింట్లతో మొదలైంది. ఆ తర్వాత క్రమంగా పైకి చేరుతూ ఓ దశలో 61,404 పాయింట్లను టచ్‌ చేసింది. ఆ తర్వాత ఇన్వెస్టర్లు అమ్మకాలు ప్రారంభించడంతో వరుసగా పాయింట్లు నష్టపోయింది. ఆ తర్వాత తిరిగి కోలుకోవడం మొదలైనా.. అది కొంత సేపే అయ్యింది. ఆ తర్వాత భారీగా నష్టపోతున్నాయి దేశీ సూచీలు.  ఉదయం 10:12 గంటల సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 354 పాయింట్లు నష్టపోయి 60,467 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు నిఫ్టీ 99 పాయింట్లు నష్టపోయి 18,016 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top