
దేశంలో కరోనా కేసులు రికార్డు స్థాయిలు నమోదు కావడంతో 327 పాయింట్ల నష‍్టంతో 48222 వద్ద, నిఫ్టీ 82 పాయింట్లు క్షీణించి 14425 వద్ద కొనసాగుతోంది.
సాక్షి, ముంబై: ప్రపంచ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో ఆరంభంలో ఫ్లాట్‌గా ఉన్న స్టాక్‌మార్కెట్లు ఆ తరువాత 100పాయింట్లకు పైగా ఎగిసాయి. కానీ దేశంలో కరోనా కేసులు రికార్డు స్థాయిలు నమోదు కావడంతో ఒక్కసారిగా అమ్మకాల ధోరణి వెల్లువెత్తింది. పలితంగా సెన్సెక్స్ డై హైనుంచి 500 పాయింట్లు పతనమైంది. ప్రస్తుతం 327 పాయింట్ల నష‍్టంతో 48222 వద్ద, నిఫ్టీ 82 పాయింట్లు క్షీణించి 14425 వద్ద కొనసాగుతోంది. హెల్త్‌కేర్ మినహా అన్ని సెక్టార్ల షేర్లలో అమ్మకాల జోరుకొనసాగుతోంది. ఆరంభంలో లాభపడిన మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు కూడా భారీగా నష్టపోతున్నాయి. (కరోనా కలకలం: రికార్డు స్థాయిలో కేసులు)
అటు రూ.5076కోట్ల నికరలాభం ప్రకటించిన ఇన్ఫోసిస్ 17.5శాతం వృద్ధి నమోదు చేసిన ఇన్ఫోసిస్ 3.27శాతం నష్టంతో టాప్ లూజర్‌గా ఉంది. గ్రాసిం, ఐషర్ మోటర్స్,ఇండస్ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్,మారుతి సుజికి భారీ నష్టాలను మూటగట్టుకుంటున్నాయి. మరోవైపు టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యుపిఐ)ద్రవ్యోల్బణం మార్చిలో అంచనాలను మించి 7.39 శాతంగా నమోదైంది. (ఇన్ఫీ లాభం రూ. 5,076 కోట్లు)