Covid Positive Cases In India Last 24 Hours, Covid Second Wave Deaths In India - Sakshi
Sakshi News home page

కరోనా కలకలం: రికార్డు స్థాయిలో కేసులు

Apr 15 2021 9:41 AM | Updated on Apr 15 2021 1:23 PM

COVID19 India reported fresh  2,00,739  cases and 1038 deaths in the last 24 hours - Sakshi

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించిన గణాంకాల ప్రకారం గడచిన 24 గంటల్లో 2,00,739 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.

సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ కలకలం రేపుతోంది. దేశంలో రోజుకో కొత్త రికార్డుతో బెంబేలెత్తిస్తోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించిన గణాంకాల ప్రకారం  రోజువారీ కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో రెండు లక్షల మార్క్‌ను దాటేసింది. గడచిన 24 గంటల్లో 2,00,739 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే మరణాల సంఖ్య 1038గా నమోదైంది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య1.40 కోట్లను దాటేసింది. ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 1,73,123కి చేరింది.  

తెలంగాణ రాష్ట్రంలో కరోనా  మరింత విజృంభిస్తోంది.  వైద్య ఆరోగ్యశాఖ గురువారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌ ప్రకారం రాష్ట్రంలో  కొత్తగా 3,307 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, నిన్న ఎనిమిది మంది మరణించారు.  దీంతో కరోనాతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 1,788కి చేరింది.

  (షాపింగ్‌ మాల్స్‌కు ‌కరోనా సెకండ్‌ వేవ్‌ షాక్‌!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement