క్లబ్‌హౌజ్‌లో ఎంట్రీ ఇప్పుడు మరింత ఈజీ..!

Clubhouse Is Now Open For Everyone On Ios And Android - Sakshi

గత కొన్ని రోజుల నుంచి బాగా ప్రాచుర్యం పొందిన సోషల్‌మీడియా యాప్‌ క్లబ్‌హౌజ్‌. ఈ యాప్‌తో  ఆడియో రూపంలో యూజర్లు తమ భావాలను ఇతరులతో పంచుకోవచ్చును. ఈ యాప్‌  తొలుత ఆపిల్‌ ఐవోఎస్‌ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండగా, ప్రస్తుతం ఆండ్రాయిడ్‌ యూజర్లకు కూడా అందుబాటులోకి వచ్చింది. క్లబ్‌హౌజ్‌ యాప్‌ను మార్చి 2020లో​ విడుదల చేశారు. క్లబ్‌హౌజ్‌కు భారీగా ప్రాచుర్యం రావడంతో దిగ్గజ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం ఫేస్‌బుక్‌ కూడా ఆడియో రూపంలో సరికొత్త యాప్‌ను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది.  

ఇతర సోషల్ మీడియా యాప్స్ మాదిరిగా కాకుండా, క్లబ్‌హౌజ్‌లో చేరాలంటే కేవలం అందులో ఉన్న సభ్యులు ఆహ్వానిస్తేనే చేరే అవకాశం ఉంటుంది. మీ స్నేహితుడు, లేదా ఇతరులు  ఆహ్వానిస్తేనే తప్ప అందులో చేరే అవకాశం లేదు. ఆహ్వానం లేకుండా ఫోన్ నంబర్‌తో నమోదు చేసుకోవాలనుకునే వారిని వెయిటింగ్ లిస్టులో చూపిస్తోంది. వెయిటింగ్‌ లిస్ట్‌ ప్రకారం కొత్త యూజర్లకు  క్లబ్‌హౌజ్‌ అందుబాటులో వస్తోంది.  తాజాగా క్లబ్‌హౌజ్‌ అధిక సంఖ్యలో యూజర్లను ఆకర్షించడం కోసం కీలక నిర్ణయం తీసుకుంది.

ఎలాంటి ఇన్విటేషన్‌ కోడ్‌ లేకుండా యూజర్లు ఇకపై క్లబ్‌హౌజ్‌లో జాయిన్‌ కావచ్చునని ఒక ప్రకటనలో పేర్కొంది. వెయిటింగ్‌ లీస్ట్‌ పద్దతిని కూడా ఎత్తి వేసింది. క్లబ్‌హౌజ్‌ లాంటి సర్వీసులను ప్రముఖ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలు ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌, రెడ్డిట్‌, టెలిగ్రాం వంటివి తమ సొంత వర్షన్లతో యాప్‌ను రిలీజ్‌ చేయాలని భావిస్తున్నాయి. క్లబ్‌హౌజ్‌ ప్రకారం.. ప్రస్తుతం క్లబ్‌హౌజ్‌లో డేలీ రూమ్స్‌ సంఖ్య 50 వేల నుంచి 5 లక్షలకు పెరిగింది. అంతేకాకుండా క్లబ్‌ హౌజ్‌ టెడ్‌ టాక్స్‌తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top