భారత్‌లో సిట్రన్‌ సీ5 ఎయిర్‌క్రాస్‌ ఎస్‌యూవీ

Citroen C5 Aircross Launched at RS 30 Lakh - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వాహన తయారీలో ఉన్న సిట్రన్‌ తాజాగా సీ5 ఎయిర్‌క్రాస్‌ ఎస్‌యూవీని భారత్‌లో ప్రవేశపెట్టింది. దీని ధర రూ.29.9 లక్షల(న్యూఢిల్లీ ఎక్స్‌-షోరూమ్‌) నుంచి ప్రారంభమవుతుంది. 8 స్పీడ్‌ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌తో 2 లీటర్‌ డీజిల్‌ పవర్‌ట్రెయిన్‌ పొందుపరిచారు. గ్రిప్‌ కంట్రోల్, బ్లైండ్‌ స్పాట్‌ మానిటరింగ్‌ సిస్టమ్, పార్క్‌ అసిస్ట్, ఇంజన్‌ స్టాప్‌/స్టార్ట్, 31.24 సెంటీమీటర్ల డిజిటల్‌ డ్రైవర్‌ డిస్‌ప్లే, 20.32 సెంటీమీటర్ల ఇన్ఫోటైన్‌మెంట్‌ టచ్‌ స్క్రీన్‌ వంటి హంగులున్నాయి. లీటరుకు మైలేజీ 18.6 కిలోమీటర్లు అని కంపెనీ తెలిపింది. ఇప్పటికే 1,000కిపైగా ప్రీ-బుకింగ్స్‌ నమోదయ్యాయని సిట్రన్‌ ఇండియా సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రోలాండ్‌ బౌచరా తెలిపారు. డీలర్‌ నెట్‌వర్క్‌ లేని 50కిపైగా నగరాల్లో వినియోగదార్లు ఆన్‌లైన్‌లో ఈ కారును ఆర్డర్‌ చేయవచ్చు. ఫ్యాక్టరీ నుంచే నేరుగా కస్టమర్‌ ఇంటికి చేరుస్తారు. వచ్చే నాలు గేళ్లలో 4 కొత్త మోడళ్లను అందుబాటులోకి తేనున్నట్టు కంపెనీ ఇప్పటికే ప్రకటించింది.

చదవండి: స్కోడా కారుపై రూ.8 లక్షల వరకు డిస్కౌంట్

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top