చాట్‌ జీపీటా మజాకా..! పాత బకాయిల చిట్టా కావాలా? ఇదుగో ఇలా చేయండి..

Chatgpt Helping In Recovery Of Unclaimed Money - Sakshi

ఐపీఎల్‌ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? లేదంటే ఇంటర్వ్యూకి వెళ్తున్నారు..రెజ్యూమ్‌ తయారు చేసి పెట్టాలా? కస్టమర్ల అవసరాల్ని అర్ధం చేసుకొని వారికి సేవల్ని అందించాలని అనుకుంటున్నారా? ఓస్‌ ఇంతేనా? ఇప్పుడు మనందరి జీవితాల్లో భాగమైన చాట్‌జీపీటీతో ఇంకా చాలా చేయొచ్చు. 

అంతెందుకు మీకు ఆన్‌లైన్‌లో పలు సంస్థల నుంచి మీరు క్లయిమ్‌ చేయలేని డబ్బులు ఎంతనేది చాట్‌జీపీటీని అడగండి సెకన్ల వ్యవధిలో మీరు ఎంత డబ్బు మర్చిపోయారో గుర్తు చేస్తుంది. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా ఒక్కటే మీకు కావాల్సిన అంశాలపై చాట్‌జీపీటీకి అర్ధమయ్యేలా కొన్ని ఇన్‌పుట్స్‌ ఇస్తే చాలు అది వాటిని అర్థం చేసుకొని పూర్తిస్థాయిలో అవుట్‌పుట్స్‌ను అందిస్తుంది. 

తాజాగా ప్రపంచంలో తొలి రోబోట్‌ లాయర్‌గా విధులు నిర్వహించే ‘డూనాట్‌పే’ సంస్థ సీఈవో 19ఏళ్ల జాషువా బ్రౌడర్ తనకు ఎక్కడ నుంచైనా డబ్బు రావాల్సి ఉందా? ఉంటే కాస్త చెప్పూ అంటూ చాట్‌జీపీటీని అడిగాడు. వెంటనే కాలిఫోర్నియా ప్రభుత్వం నుంచి మీకు రూ. 17,000 రావాల్సి ఉందని, వెంటనే క్లయిమ్‌ చేసుకోమని సలహా ఇచ్చింది. ఆ డబ్బులు తిరిగి ఎలా రాబట్టుకోవాలో సూచనలిచ్చింది. ఇదంతా తనకు చాట్‌జీపీటీ చెప్పినట్లు ఆస్క్రీన్‌ షాట్‌లను ట్వీట్‌ చేశాడు.  

క్లయిమ్‌ ఎలా చేసుకున్నాడు
ముందుగా తనని కాలిఫోర్నియా స్టేట్ కంట్రోలర్ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది. ఆయా కంపెనీలు మిమ్మల్ని సంప్రదించలేని పక్షంలో ఆ డబ్బుల్ని స్టేట్‌ కంట్రోలర్‌ వెబ్‌సైట్‌ నుంచి క్లెయిమ్ చేసుకోవచ్చు. అలా బ్రౌండర్‌ చాట్‌జీపీటీ ఇచ్చిన సూచనలతో తన డబ్బును ఎలా క్లయిమ్‌ చేసుకోవాలి? ఎలాంటి వివరాలు పొందు పరచాలో వివరించింది. వాటి ఆధారంగా డబ్బుల్ని క్లయిమ్‌ చేసుకున్నట్లు బ్రౌండర్‌ తెలిపాడు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top