Elon Musk reacts after ChatGPT calls him 'Controversial' - Sakshi
Sakshi News home page

ఎలాన్‌ మస్క్‌ గురించి చాట్‌జీపీటీ ఏమంటుందంటే?

Feb 20 2023 12:39 PM | Updated on Feb 20 2023 1:15 PM

Chatgpt Calls Elon Musk Controversial - Sakshi

టెక్నాలజీ రంగంలో చాట్‌జీపీటీ సరికొత్త సంచలనం సృష్టిస్తోంది. అడిగిన ప్రశ్నలకు కచ్చితమైన సమాచారం అందిస్తుండడంతో ఈ లేటెస్ట్‌ టెక్నాలజీని వినియోగించేందుకు యూజర్లు మక్కువ చూపుతున్నారు. అయితే ఈ తరుణంలో ఐజాక్ లాటెరెల్(Issac Latterell) అనే నెటిజన్ ఎలాన్‌ మస్క్‌ గురించి, ప్రముఖ వ్యక్తుల గురించి చాట్‌జీపీటీ ఏమనుకుంటుందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. 

ఈ సందర్భంగా ఎలాన్‌ మస్క్‌, డొనాల్డ్‌ ట్రంప్‌ కెన్యా వెస్ట్‌తో పాటు మరికొంత మందిని చాట్‌జీపీటీ వివాదాస్పద వ్యక్తులుగా పరిగణలోకి తీసుకుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదమీర్‌ పుతిన్‌, యూకే మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌, నటి కిమ్‌ కర్దాషియన్ వివాదాస్పద వ్యక్తులుగా గుర్తించింది. అలాగే వీరిని ప్రత్యేకంగా పరిగణించాలని కూడా చెప్పింది.

ఐజాక్‌ ట్విట్‌ ప్రకారం.. చాట్‌జీపీటీ లిస్ట్‌లో ట్రంప్‌, ఎలాన్‌ మస్క్‌ వివాదాస్పద వ్యక్తులే. కానీ వారిని ప్రత్యకమైన వ్యక్తులుగా పరిగణలోకి తీసుకోవచ్చని,అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌ మాత్రం కాదు’ అంటూ ట్విట్‌లో పేర్కొన్నారు. దీనిపై మస్క్  స్పందిస్తూ రెండు ఆశ్చర్యార్థకాలను(!!) పోస్టు చేశారు.

ఇక, న్యూజిలాండ్ మాజీ ప్రధాని జసిందా ఆర్డెర్న్, బిల్ గేట్స్, ఓప్రా విన్‌ఫ్రేలను వివాదాస్పదుల జాబితాలో చేర్చింది. కాగా, చాట్‌జీపీటీ మీడియా కథనాల ఆధారంగా వారిని వివాదాస్పద వ్యక్తులుగా పరిగణలోకి తీసుకొని ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement