గుడ్‌న్యూస్‌: తగ్గనున్న వంట నూనె ధరలు .. కొత్తగా మిషన్‌ ఆయిల్‌ ఫామ్‌

Central Goverment Approved National Mission On Edible Oils Palm Oil Production - Sakshi

న్యూఢిల్లీ: వంట నూనెల దిగుమతి తగ్గించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనికి బదులుగా దేశీయంగా నూనె గింజన ఉత్పత్తి పెంచాలని డిసైడ్‌ అయ్యింది. అందుకు తగ్గట్టుగా  మిషన్ ఆఫ్‌ ఆయిల్‌పామ్‌కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ మిషన్‌ ఆయిల్‌పామ్‌ పథకానికి రూ.11,040 కోట్లు కేటాయించింది. 

దిగుమతుల భారం
వంట నూనెల ధరలు ఇటీవల అనూహ్యంగా పెరిగాయి. ఇండియా వంట నూనెల్లో సగానికి పైగా ఇండోనేషియా, మలేషియా, బ్రెజిల్‌, అమెరికాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఇటీవల బ్రెజిల్‌, అమెరికాలలో ఆయిల్‌ ముడి సరుకుల ఉత్పత్తి తగ్గిపోవడంతో ధరలు పెరిగాయి. మరోవైపు ఇండోనేషియా, మలేషియాలు ఎగుమతి సుంకాలు పెంచాయి. వెరసి ఈ ఏడాది ఆరంభం నుంచి ఇప్పటి వరకు వంట నూనెల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇటీవల కేంద్రం వంట నూనెలపై న్నులు తగ్గించింది. అయినా ధరలు అదుపులోకి రాలేదు. 

ఉత్పత్తి పెంపుకు
ఇండియా ఎక్కువగా పామ్‌ఆయిల్‌ని దిగుమతి చేసుకుంటోంది. వేరు శనగ, పొద్దు తిరుడుతో పోల్చితే మన దగ్గర పామ్‌ ఆయిల్‌ సాగు తక్కువగా ఉంది. దీంతో వంట నూనెల తయారీలో కీలకమైన ఫామాయిల్‌ సాగును ప్రోత్సహించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు మిషన్‌ ఆఫ్‌ ఆయిల్‌ ఫామ్‌ను ప్రకటించింది.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top