
అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఫిస్కర్ ఇండియాలో తన ఆపరేషన్స్ ప్రారంభించనుంది. ఈ మేరకు హైదరాబాద్‌లో ఆ సంస్థకు సంబంధించిన ఇండియా ప్రధాన కార్యాలయం ఫిస్కర్ విజ్ఞాన్ ఇండియాను ప్రారంభించింది. ఇక్కడ ఈవీ వెహికల్స్‌కి అవసరమైన సాఫ్ట్‌వేర్ అభివృద్ధి, ఎంబెండెడ్ ఎలక్ట్రానిక్స్, మెషిన్ లెర్నింగ్, వర్చువల్ వెహికల్ డెవలప్‌మెంట్ తదితర పనులు నిర్వహించనున్నారు.
ఫిస్కర్ సంస్థ నుంచి మొదటి ఎలక్ట్రిక్ కారు ఓషియన్ ఎస్‌యూవీ 2022 నవంబరులో మార్కెట్‌లోకి రానుంది. ఈ కారు సింగిల్ ఛార్జ్‌తో 402-440 కిలోమీటర్ల రేంజ్ మైలేజ్ ఇస్తుందని అంచనా. గత నెలలో కేటీఆర్ అమెరికా పర్యటన సందర్భంగా ఫిస్కర్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ చర్చలు ఫలించి ఫిస్కర్ సంస్థ హైదరాబాద్‌లో తమ కార్యాలయం ఏర్పాటు చేసింది.
Hello India! We have established our India Headquarters in the Southern City of Hyderabad, Telangana for Initial Operations.#Fisker #India #office #HQ #jobs #operations pic.twitter.com/dBYNc7I9mK
— Fisker Inc. (@FiskerInc) April 12, 2022