Bisleri Success Story 1969-2022: అపుడు 4 లక్షలు, ఇపుడు వేల కోట్లు, ‘బిస్లరీ’ పేరు ఎలా వచ్చింది? 

Bisleri Interesting Journey1969-2022 details here - Sakshi

సాక్షి,ముంబై:  భారతదేశంలోనే అతిపెద్ద ప్యాకేజ్డ్ డ్రింకింగ్ కంపెనీ  బిస్లరీని టాటా గ్రూపునకు చెందిన  టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్‌ టేకోవర్‌ చేయనుంది. 1969లో  కేవలం నాలుగు లక్షలకు రూపాయలకు కొనుగోలు  చేసిన బిస్లరీ ఇపుడు 7 వేల  కోట్లకు చేరింది.  1969లో  28 ఏళ్ల చౌహాన్‌  నేతృత్వంలో ని పార్లే ఎక్స్‌పోర్ట్స్ ఇటాలియన్ వ్యాపారవేత్త నుండి బిస్లరీ కొనుగోలు చేశారు. అపుడు దీని  రూ. 4 లక్షలు. బిస్లరీని టాటాలకు 6-7వేల కోట్ల రూపాయలకు విక్రయించనున్నారు. ఈ నేపథ్యంలో 1969-2022ల వరకు బిస్లరీ జర్నీని ఒకసారి చూద్దాం. (Bisleri చైర్మన్‌ సంచలన నిర్ణయం: రూ. 7 వేల కోట్ల డీల్‌)

1969-2022  బిస్లరీ సక్సెస్‌ జర్నీ

బిస్లరీ ఒక ఇటాలియన్ కంపెనీ, దీనిని 1965లో ఫెలిస్ బిస్లరీ స్థాపించారు.   అలా కంపెనీకి ఆ పేరు స్థిరపడింది.
1969లో ఇటాలియన్ వ్యాపారవేత్త ఫెలిస్ బిస్లరీనుంచి చౌహాన్‌ కొనుగోలు చేశారు.
►  Bisleriని తొలుత  భారతదేశంలో గాజు సీసాలలో, బబ్లీ, స్టిల్ అనే రెండు వేరియంట్‌లలో లాంచ్‌  చేశారు. 
► తమ పోర్ట్‌ఫోలియోలో గోల్డ్ స్పాట్ వంటి బ్రాండ్లు ఉన్నాయి కానీ సోడా లేదు.  అందుకే పాపులర్‌  బిస్లరీ సోడాను కొనుగోలు చేశానని చౌహాన్‌  చెప్పారు. అంతేకాదు అసలు నీళ్ల వ్యాపారంపై దృష్టి లేదట.


► 60వ -70వ దశకం ప్రారంభంలో ఫైవ్ స్టార్ హోటళ్ల నుండి సోడాకు మంచి డిమాండ్ ఉంది. 1993లో తన శీతల పానీయాల పోర్ట్‌ఫోలియోను రూ. 186 కోట్లకు కోకాకోలాకు విక్రయించినప్పుడు మాత్రమే అతని దృష్టి బాటిల్ వాటర్ పరిశ్రమపై పడింది.
ప్రారంభంలో  రవాణాదారులు నీటిని రవాణా చేయడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. అందుకే తానే స్వయంగా రవాణా చేయాలని చౌహాన్ నిర్ణయించుకున్నారు.  కట్‌ చేస్తే బిస్లరీకి ఇప్పుడు 4,500 డిస్ట్రిబ్యూటర్లు ,వాటర్ బాటిళ్లను రవాణా చేసే 5,000 ట్రక్కులు ఉన్నాయి.
 2000ల ప్రారంభంలో టాటాకు చెందిన  హిమాలయన్ బ్రాండ్‌తో  మౌంట్ ఎవరెస్ట్ మినరల్ వాటర్‌తో బిస్లరీకి గట్టి పోటీ ఎదురైంది. ఇంకా అక్వాఫినా, కిన్లీ వంటి పోటీదారుల  గట్టి పోటీ ఉన్నా తట్టు​కొని టాప్‌లో నిలబడింది


►  కోకా-కోలా (కిన్లే), పెప్సికో (ఆక్వాఫినా), కింగ్‌ఫిషర్ , నెస్లే వంటి పోటీదారుల మాదిరిగా కాకుండా, చౌహాన్‌కు ఇదొక్కటే ప్రధాన వ్యాపారం. అందుకే  పట్టుదలగా సక్సెస్‌ను నిలుపుకున్నారు.
 కస్టమర్‌కు మెరుగైన విలువ, ప్యాకేజింగ్ లేదా పంపిణీని అందించే బ్రాండ్‌లు లేవు. ఏ బిజినెస్‌లోనైనా ముందు వచ్చినవారికే  సక్సెస్‌.అయితే  రెండవ లేదా మూడవ స్థానంలో వచ్చినట్లయితే,  డిఫరెన్సియేటర్‌గా ఉంటే మంచిది.  సో.. ఫస్ట్-మూవర్‌గా బ్రాండ్‌కోసం చాలా  కష్టపడ్డాను అని 2007లో ఎకనామిక్ టైమ్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చౌహాన్ వెల్లడించారు.  (షాకింగ్: గూగుల్ పే, పోన్‌పేలాంటి యాప్స్‌లో ఇక ఆ లావాదేవీలకు చెక్‌?)
తన శీతల పానీయాల పోర్ట్‌ఫోలియోను ఎందుకు విక్రయించారని అడిగినప్పుడు, మాజా, సిట్రా, గోల్డ్ స్పాట్ ,రిమ్-జిమ్ వంటి బ్రాండ్‌లను ప్రకటనలకు తన వద్ద అంత డబ్బులేదు.  అందుకే బాటిలర్లపై ఎక్కువగా ఆధారపడేవాడినంటారు చౌహాన్‌.


కానీ వయసు,ఆరోగ్యం క్షీణించడంతోపాటు, అతని కుమార్తె జయంతికి వ్యాపారంలోఆసక్తి లేకపోవడంతో, కంపెనీని టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్‌కు విక్రయించే  నిర్ణయం తీసుకున్నారు. బిస్లరీతో విడిపోవడం బాధాకరమైన నిర్ణయమే, కానీ టాటాలు దానిని చాలా జాగ్రత్తగా  కాపాడతారనే విశ్వాసాన్ని ప్రకటించారు చౌహాన్‌.
► కంపెనీని నడపాలన్న ఉద్దేశం లేని కారణంగా  మైనారిటీ వాటాను ఉంచుకోనని, పర్యావరణం , స్వచ్ఛంద కార్యక్రమాలపై దృష్టి పెడతానని  82 ఏళ్ల చౌహాన్ చెప్పారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top