లా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించిన అశ్నీర్‌ గ్రోవర్.. కారణం అదేనా.. | Sakshi
Sakshi News home page

లా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించిన అశ్నీర్‌ గ్రోవర్.. కారణం అదేనా..

Published Fri, Dec 15 2023 1:26 PM

Ashneer Grover Went To Law Tribunal To ReAppoint As MD - Sakshi

ప్రముఖ మొబైల్ యాప్ భారత్‌పే కో-ఫౌండర్, సంస్థ మాజీ ఎండీ అశ్నీర్‌ గ్రోవర్ కంపెనీ యాజమాన్యంపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ)ను ఆశ్రయించారు. ప్రస్తుత భారత్‌పే బోర్డు అధికార దుర్వినియోగం చేస్తుందని ఆరోపించారు. భారత్‌పే ఎండీగా తనను తిరిగి సంస్థలో నియమించాలని కోరుతూ ఆయన ఎన్‌సీఎల్‌టీను ఆశ్రయించారు. 

కంపెనీ రిసీలియెంట్‌ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బోర్డు నిబంధనలను తారుమారు చేసి, యాజమాన్యంలో చట్టవిరుద్ధ మార్పులు చేసిందని చెప్పారు. ఆయన రాజీనామా అనంతరం 2022 మార్చి ఒకటో తేదీ నుంచి జారీ చేసిన షేర్లు / ఈఎస్ఓపీఎస్‌కు సంబంధించిన కంపెనీ నిర్ణయాలను తిరగదోడాలని డిమాండ్ చేశారు. దీనిపై కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో అడిటింగ్‌కు  ఆదేశించాలని ఎన్‌సీఎల్‌టీని కోరారు.

భారత్‌పే సంస్థ నుంచి తన భార్య మాధురి జైన్ తొలగింపు చట్ట విరుద్ధమని, ఆమెను తిరిగి ఉద్యోగంలో నియమించాలన్నారు. తన రాజీనామా తర్వాత బోర్డులో కొత్తగా నియమించిన సభ్యులను తొలగించాలని అభ్యర్థించారు. కంపెనీల చట్టం-2013లోని 241, 242 సెక్షన్ల ప్రకారం పిటిషన్ దాఖలు చేసిన అశ్నీర్‌ గ్రోవర్..అణచివేతకు పాల్పడుతూ అధికార దుర్వనియోగంతో తనను తొలగించినందుకు కంపెనీ ప్రస్తుత యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇదీ చదవండి: ఫ్యుయల్ ఆదా అవ్వాలంటే ఇది యాక్టివేట్‌ చేయాల్సిందే..!

ఇటీవల గ్రోవర్ పిటిషన్ ఎన్‌సీఎల్‌టీ బెంచ్ ముందు విచారణకు వచ్చింది. ఈ కేసు తదుపరి విచారణను వచ్చే నెల 11కు వాయిదావేసింది. తన పిటిషన్‌కు సంబంధించి ప్రాథమిక సాక్ష్యాధారాలు సమర్పించినట్లు తెలిసింది. అశ్నీర్‌ గ్రోవర్ తన పిటిషన్‌లో కంపెనీ కో ఫౌండర్ శస్వత్ నక్రానీతోపాటు చైర్మన్ రజనీష్ కుమార్, మాజీ సీఈఓ కం డైరెక్టర్ సుశీల్ సమీర్ తదితర 12 మందిని ప్రతివాదులుగా చేర్చారు.

Advertisement
 
Advertisement
 
Advertisement