‘డ్యూడ్‌.. కాస్త రెస్ట్‌ తీసుకోండి’ నితిన్‌ కామత్‌ను కోరిన వ్యాపారవేత్త | Ashneer Grover Responds On Nithin Kamath Health | Sakshi
Sakshi News home page

‘డ్యూడ్‌.. కాస్త రెస్ట్‌ తీసుకోండి’ నితిన్‌ కామత్‌ను కోరిన వ్యాపారవేత్త

Feb 27 2024 6:03 PM | Updated on Feb 27 2024 6:14 PM

Ashneer Grover Responds On Nithin Kamath Health - Sakshi

ప్రముఖ స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థ జెరోధా వ్యవస్థాపకుడు, సీఈవో నితిన్ కామత్ ఆస్పత్రి బెడ్‌పై కనిపించిన ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. అయితే ఇది ఆరు వారాల కిందటి ఫొటోలని నిర్థారించారు. ఆ ఫొటోలు చూసిన సహచరులు, ఇతర వ్యాపార వేత్తలు సామాజిక మాధ్యమాల్లో తను విరామం తీసుకోవాలని నితిన్‌ను కోరుతూ పలువురు పోస్ట్‌ చేశారు. 

సుమారు 6 వారాల క్రితం, నాకు ఉన్నంటుండి తేలికపాటి స్ట్రోక్ వచ్చింది. నాన్న చనిపోవడం, సరిగా నిద్ర లేకపోవడం, అలసట, డీహైడ్రేషన్‌, హెవీ వర్కవుట్‌.. వీటిలో ఏవైనా కారణాలు కావచ్చు" అని కామత్ తన ‘ఎక్స్‌’ (ట్విటర్‌) పోస్ట్‌లో తెలియజేశారు. 

విషయం తెలియగానే ప్రముఖ వ్యాపారవేత్త అష్నీర్‌ గ్రోవర్‌ స్పందించారు. ‘డ్యూడ్‌.. జాగ్రత్తగా ఉండండి. నాకు తెలిసి మీ నాన్న మరణమే మీ ఆరోగ్యంపై ఎక్కువ ప్రభావం చూపినట్లుంది. మా నాన్న చనిపోయినప్పుడు కూడా నాకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. కాస్త రెస్ట్‌ తీసుకోండి’ అని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement