‘అచీవర్‌’ ఆంధ్రప్రదేశ్‌.. కేంద్ర ప్రభుత్వ సూచికలో టాప్‌! | Sakshi
Sakshi News home page

‘అచీవర్‌’ ఆంధ్రప్రదేశ్‌.. కేంద్ర ప్రభుత్వ సూచికలో టాప్‌!

Published Sat, Dec 16 2023 3:57 PM

andhra pradesh among achievers in logistics performance index 2023 - Sakshi

వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో అద్భుత ప్రగతి సాధిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ మరో ఘనత సాధించింది. సరకు రవాణా రంగంలో అద్భుత పనితీరుతో దేశంలోని అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది. లాజిస్టిక్స్ ఇండెక్స్ చార్ట్ 2023లో అచీవర్‌గా అవతరించింది.

సరకు రవాణాలో దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతల పనితీరుపై రూపొందించిన లాజిస్టిక్స్ ఇండెక్స్ చార్ట్ 2023ను కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ తాజాగా విడుదల చేసింది. ఈ ఇండెక్స్‌లో 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను అచీవర్‌లుగా వర్గీకరించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌ ఒకటిగా నిలిచింది. ఏపీతోపాటు కర్ణాటక, తమిళనాడు, చండీగఢ్, గుజరాత్ తదితర రాష్ట్రాలు ఈ జాబితాలో ఉ‍న్నాయి. ఎగుమతులు, ఆర్థిక వృద్ధికి అవసరమైన లాజిస్టికల్ సేవల్లో ఆయా రాష్ట్రాల సామర్థ్యాన్ని ఈ సూచిక తెలియజేస్తోంది.

కాగా లాజిస్టిక్స్ ఇండెక్స్ చార్ట్‌లో అచీవర్స్‌ తర్వాత ఫాస్ట్ మూవర్స్‌ కేటగరిలో కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ రాష్ట్రాలు నిలిచాయి. గోవా, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బిహార్, ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాలు ఆస్పైరర్స్ కేటగిరీలో ఉన్నాయి. రాష్ట్రాల్లో సరకు రవాణా సేవలకు కల్పిస్తున్న అనుకూల పరిస్థితుల ఆధారంగా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఈ ర్యాంకింగ్‌ ఇచ్చింది.

Advertisement
 
Advertisement
 
Advertisement