అంబానీ మరో ఖరీదైన కారు.. వీడియో వైరల్ | Mukesh Ambani's 9th Rolls Royce Cullinan features ultra-rare Pebble Rolls Royce Cullinan SUVs in a viral video on social media.|Sakshi
Sakshi News home page

అంబానీ మరో ఖరీదైన కారు.. వీడియో వైరల్

Published Mon, Jun 24 2024 9:43 PM | Last Updated on Tue, Jun 25 2024 8:55 AM

Ambanis 9th Rolls Royce Cullinan Video

భారతదేశంలో అత్యంత సంపన్నుడైన ముకేశ్ అంబానీ వద్ద ఇప్పటికే ఖరీదైన అనేక అన్యదేశ్య కార్లు ఉన్నాయి. కాగా ఇటీవల మరో రోల్స్ రాయిస్ కారు వారు గ్యారేజిలో చేరినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇప్పటికే ముకేశ్ అంబానీ గ్యారేజిలో ఎనిమిది రోల్స్ రాయిస్ కార్లు ఉన్నాయి. అయితే ఇప్పుడు వీడియోలో కనిపించే రోల్స్ రాయిస్.. 9వ కారు అని తెలుస్తోంది. వీడియోలో మహీంద్రా స్కార్పియో, టయోటా ఫార్చ్యూనర్, మెర్సిడెస్ జీ63 ఏఎంజీ కార్లు కాన్వాయ్ ముందు భాగంలో ఉన్నాయి. ఆ తరువాత రోల్స్ రాయిస్ కారు రావడం గమనించవచ్చు.

వీడియో రాత్రి సమయంలో రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది. కాబట్టి కారు ఏ కలర్ అనేది స్పష్టంగా తెలియడం లేదు. బహుశా ఇది వైట్ కలర్ అని తెలుస్తోంది. దీని ధర రూ. 10 కోట్లు కంటే ఎక్కువ ఉంటుందని తెలుస్తోంది. ముకేశ్ అంబానీ గ్యారేజిలో రోల్స్ రాయిస్ కార్లు మాత్రమే కాకుండా ఇతర సూపర్ కార్లు కూడా ఉన్నట్లు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement