Amazon Year-End Sale: స్మార్ట్‌ఫోన్లపై అమెజాన్‌ అందిస్తోన్న టాప్‌ డీల్స్‌ ఇవే..!

Amazon Year End Sale On Phones Arrives Here Are Top 5 Deals - Sakshi

ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ఇయర్‌ ఎండ్‌ సేల్‌ను ప్రారంభించింది. స్మార్ట్‌ఫోన్స్‌, స్మార్ట్ టీవీలపై భారీ తగ్గింపును అమెజాన్‌ అందిస్తోంది. ఈ సేల్‌ డిసెంబర్‌ 31 వరకు కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. రెడ్‌మీ 9ఏ, రెడ్‌మీ నోట్‌ 10ఎస్‌, షావోమీ 11 లైట్‌ ఎన్‌ఈ 5G, శాంసంగ్‌ గెలాక్సీ ఎమ్‌ సిరీస్‌ స్మార్ట్‌ఫోన్స్‌, శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌20 ఎఫ్‌ఈ 5జీ, రియల్‌మీ నార్జో 50ఏ, వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ వంటి స్మార్ట్‌ఫోన్స్‌తో పాటుగా ప్రముఖ స్మార్ట్‌ఫోన్లపై కొనుగోలుదారులు 40 శాతం వరకు తగ్గింపును పొందవచ్చు. 

ఆయా స్మార్ట్‌ఫోన్ల కొనుగోలుపై బ్యాంకు ఆఫర్లను కూడా అమెజాన్‌ అందిస్తోంది. అమెజాన్‌ పే, ఐసీఐసీఐ క్రెడిట్‌ కార్డులపై అదనంగా  రూ. 1,500 వరకు తగ్గింపు రానుంది. అంతేకాకుండా నో-కాస్ట్ ఈఎంఐ సౌకర్యాన్ని కూడా అందిస్తోంది.  ప్రైమ్ మెంబర్స్‌కు 6-నెలల ఉచిత స్క్రీన్ రీప్లేస్‌మెంట్, అదనంగా 3 నెలల నో కాస్ట్  వంటి ప్రయోజనాలు ఉన్నాయి. 

స్మార్ట్‌ఫోన్లపై అమెజాన్‌ అందిస్తోన్న టాప్‌ డీల్స్‌ ఇవే..!

► వన్‌ప్లస్‌ నార్డ్‌ 2 5G 8జీబీ ర్యామ్‌ వేరియంట్ రూ. 29,999కు రానుంది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై కొనుగోలుదారులు రూ. 2000 వరకు ఫ్లాట్ తగ్గింపును పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌పై పాత స్మార్ట్‌ఫోన్‌ ఎక్స్ఛేంజ్  ద్వారా బోనస్‌గా రూ. 16,950 వరకు అమెజాన్‌ అందిస్తోంది.

వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ 5జీ రూ. 24,999కు రానుంది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై కొనుగోలుదారులు రూ.1500 వరకు ఫ్లాట్ తగ్గింపును పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ. 16,950 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌ అమెజాన్‌ అందిస్తోంది. 

► రెడ్‌మీ నోట్‌ 10ఎస్‌ రూ. 14,999కు రానుంది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై కస్టమర్లు రూ. 1000 వరకు ఫ్లాట్ తగ్గింపును పొందవచ్చు. ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్‌ కింద రూ. 13,950 వరకు తగ్గింపు కూడా రానుంది. 

► షావోమీ 11 లైట్‌ ఎన్‌ఈ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్‌ లేదా డెబిట్ కార్డ్‌లతో కొనుగోలు చేస్తే  రూ. 2,500 తక్షణ తగ్గింపు రానుంది. దీంతో రూ. 24,500కు ఈ స్మార్ట్‌ఫోన్‌ను పొందవచ్చును. స్మార్ట్‌ఫోన్‌ ఎక్స్‌ఛేంజ్‌పై రూ. 19,950 కూడా రానుంది. 

చదవండి: ఐఫోన్ కొనేవారికి శుభవార్త.. రూ.18 వేలు డిస్కౌంట్..!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top