‘ఆపిల్ డే సేల్’లో ఐఫోన్లపై భారీ తగ్గింపు

Amazon Apple Days Sales Offer Deals on iPhone Mobiles - Sakshi

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా "ఆపిల్ డే సేల్"లో భాగంగా సరికొత్త ఐఫోన్ 12 మినీ, ఐఫోన్ 11 ప్రో సిరీస్, ఐఫోన్ 7లపై భారీ డిస్కౌంట్‌ను ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ "ఆపిల్ డే సేల్" ఫిబ్రవరి 17 వరకు కొనసాగుతుందని అమెజాన్ తెలిపింది. 5,410 రూపాయల తగ్గింపుతో వినియోగదారులు ఐఫోన్ 12 మినీని రూ.64,490 ధరతో పొందవచ్చని అమెజాన్ పేర్కొంది. ఐఫోన్ 11 ప్రో రూ.82,900 ధరకే లభిస్తుంది. ఛార్జింగ్ కేసు ఉన్న ఎయిర్‌పాడ్‌లు రూ.2,000 తగ్గింపుతో రూ.12,490కు లభిస్తాయి. ఇతర ఆఫర్లలో సుమారు 6,000 రూపాయల తగ్గింపుతో ఐఫోన్ 7(32 జీబీ) ధర రూ.23,990కు లభిస్తుంది. కొనుగోలు సమయంలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డులపై రూ .3,000 అదనపు తగ్గింపును పొందవచ్చు అని అమెజాన్ తెలిపింది.(చదవండి: బిగ్ బ్యాటరీతో విడుదలైన గెలాక్సీ ఎఫ్ 62)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top