ఎర్రుపాలెం: జమలాపురంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 29న మహా కుంభాభిషేకం ఉత్సవాలు మొదలుకానున్నాయి. ఇందులో భాగంగా ప్రతిష్ఠించనున్న ధ్వజ స్తంభాలకు ఆదివారం అర్చకులు, అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఓ కె.జగన్‌మోహన్‌రావు మాట్లాడుతూ మహా కుంభాభిషేకం, ధ్వజ స్థంభాల ప్రతిష్ఠా పూజలకు గ్రామస్తులు, భక్తులు సహకరించాలని కోరారు.ఽ ఈకార్యక్రమంలో వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల విజయదేవశర్మ, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, జూనియర్ అసిస్టెంట్ కృష్ణప్రసాద్, దాత తుళ్లూరు కోటేశ్వరరావుతో పాటు అంకసాల శ్రీనివాసరావు, ఎల్.పీ.నారాయణరెడ్డి నన్నపనేని రామారావు, సుఖవాసి రమేష్, వేమిరెడ్డి అంకిరెడ్డి, వీరమాచినేని జగదీష్ బాబు, భూక్యా బాలాజీ, చొప్పరపు శ్రీనివాసరావు, మిర్యాల శ్యామ్‌ప్రసాద్, మేడా భానుప్రతాప్ పాల్గొన్నారు.


