కిన్నెరసానిలో పర్యాటక సందడి | - | Sakshi
Sakshi News home page

కిన్నెరసానిలో పర్యాటక సందడి

Apr 6 2026 7:36 AM | Updated on Apr 6 2026 7:36 AM

ఎన్నికలు జరపాలని

విపక్షాల డిమాండ్‌

పాల్వంచరూరల్‌: కిన్నెరసానిలో ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల నుంచి తరలివచ్చి ప్రకృతి అందాలను ఆస్వాదించారు. డీర్‌ పార్కులోని దుప్పులు, డ్యామ్‌, జలాశయాలను వీక్షించారు. అనంతరం బోటు షికారు చేశారు. 277 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా వైల్డ్‌లైఫ్‌ శాఖకు రూ.15,450 ఆదాయం లభించింది. 250 మంది బోటింగ్‌ చేయగా టూరిజం శాఖకు రూ.17,140 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు.

మార్కెట్ల రిటైర్డ్‌ ఉద్యోగుల కమిటీ ఎన్నిక

ఖమ్మంవ్యవసాయం: వ్యవసాయ మార్కెట్‌ కమిటీల విశ్రాంత ఉద్యోగుల ఉమ్మడి జిల్లా కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. ఖమ్మం మార్కెట్‌లో టి.విశ్వనాథం అధ్యక్షతన జరిగిన సమావేశంలో సమస్యలపై చర్చించాక నూతన కమిటీని ప్రకటించారు. గౌరవ సలహాదారుగా ఆమంచి కోటయ్య, గౌరవ అధ్యక్షుడిగా టి.విశ్వనాథం, అధ్యక్షుడిగా జల్లా వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శిగా శ్రీపాద నిరంజన్‌, కోశాధికారిగా సీహెచ్‌.నాగేశ్వరరావు ఎన్నికయ్యారు. అలాగే, ఉపాధ్యక్షులుగా డి.ఉప్పలయ్య, బి.సుధాకర్‌, రెంటాల చిన్నహుస్సేన్‌, పరిటాల సత్యనారాయణ, మూర్తి, సంయుక్త కార్యదర్శులుగా ఎం.ఆంజనేయులు, ఎం.కేశవరావు, కె.సురేందర్‌రెడ్డి, కార్యవర్గ సభ్యులుగా ఎం.అరుణ్‌కుమార్‌, పి.వెంకయ్య, డి వెంకటేశ్వర్లు, ఉమామహేశ్వరరావు, ఆర్‌.రెడ్డి, బాబులాల్‌, ఉదయలక్ష్మి, శర్మ, సారంగపాణిని ఎన్నుకున్నారు.

ప్రభుత్వం పీఏసీఎస్‌లకు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ పాలకవర్గాల మాదిరిగా నామినేటేడ్‌ పద్ధతిలో నియమించాలనే ప్రతిపాదనలు తీసుకువచ్చింది. దీనిపై మంత్రివర్గ సమావేశాల్లో చర్చ కూడా సాగింది. అధికార పార్టీకి చెందిన పలువురు ఆశావహులు తమ ప్రయత్నాలూ మొదలుపెట్టారు. అయితే ప్రభుత్వం ఆ ప్రతిపాదనలను కూడా పక్కకు పెట్టి పర్సన్‌ ఇన్‌చార్జిలను నియమించటంతో ఆశావహుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. విపక్ష పార్టీల నాయకుల నుంచి ఎన్నికలు జరపాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. వానాకాలం వ్యవసాయ సీజన్‌ ఆరంభం కాకమునుపే పీఏసీఎస్‌లకు ఎన్నికలు నిర్వహించాలని సంఘ సభ్యుల నుంచి డిమాండ్లు వస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement