దుమ్ముగూడెం : ప్రముఖ పుణ్యక్షేత్రమైన పర్ణశాల శ్రీ సీతారామచంద్రస్వామి వారిని తెలంగాణ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి దంపతులు శుక్రవారం దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలను స్వీకరించారు. అనంతరం పంచవటీ కుటీరం సందర్శించారు. సీఐ వెంకటప్పయ్య, సర్పంచ్ వాగే ఖాదర్‌బాబు, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.
నేడు క్రీడా పాఠశాల ఎంపికలు
పాల్వంచరూరల్: మండల పరిధిలోని కిన్నెరసానిలో ఐదో తరగతి ప్రవేశానికి విద్యార్థుల తుది ఎంపిక శనివారం నిర్వహించనున్నట్లు ఐటీడీఏ క్రీడల అధికారి గోపాల్‌రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి ఎంపిక ప్రక్రియ జరుగుతుందని, ఉమ్మడి జిల్లాకు చెందిన గిరిజన విద్యార్థులు హాజరుకావాలని పేర్కొన్నారు. బాలికలకు కాచనపల్లిలోని గిరిజన బాలికల క్రీడాపాఠశాల్లో ఈనెల 30నఎంపికలు నిర్వహించనున్నట్లు తెలిపారు.


