పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి ఆలయంలో తొమ్మిది రోజులుగా సాగుతున్న శ్రీదేవి వసంత నవరాత్రి మహోత్సవాలు శుక్రవారం ముగిశాయి. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో ఉగాది రోజు వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారికి పంచామృతాభిషేకం, లక్ష కుసుమార్చన పూజలు, శ్రీలలితా సహస్రనామ హవనం, నీరాజన మంత్ర పుష్పం, బలిహరణ నిర్వహించారు.
అమ్మవారిని దర్శించుకున్న
ప్రముఖులు
శ్రీరామనవమికి భద్రాచలం వెళ్లి తిరుగు ప్రయాణంలో పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు. హైకోర్టు జడ్జి జె.శ్రీనివాసరావు, శేషగిరిరావు, ఏపీ హైకోర్టు జడ్జి కిరణ్మయి, నాంపల్లి కోర్టు జడ్జి శ్రీదేవి, సింగరేణి డైరెక్టర్ శ్రీనివాస్ అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు.


