రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యత
సూపర్‌బజార్(కొత్తగూడెం): భారత రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతీ పౌరుడిపై ఉందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ అన్నా రు. కొత్తగూడెం క్లబ్‌లో శనివారం నిర్వహించిన ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (ఐఎల్‌పీ ఏ) రాష్ట్ర సదస్సులో ఆయన మాట్లాడారు. రాజ్యాంగం కేవలం చట్టాల సమాహారం మాత్రమే కాదని, ప్రజల జీవన విధానాన్ని దిశానిర్దేశం చేసే మహత్తర గ్రంథమని అన్నారు. సమాన హక్కులు, గౌరవం, స్వేచ్ఛ, సోదరభావం వంటి విలువలను ప్రజలందరికీ అందించే సంకల్పంతోనే రాజ్యాంగా న్ని రాశారని వివరించారు. అందులో పొందుపర్చిన మౌలిక హక్కులు, సూత్రాలు అట్టడుగు వర్గాల అభ్యున్నతికి పునాదులుగా నిలుస్తున్నాయని చెప్పా రు. రాజ్యాంగ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో న్యాయవాదులు కీలక పాత్ర పోషించాలని సూచించారు. ఇలాంటి రాష్ట్ర స్థాయి మహాసభలు న్యాయవాదుల మధ్య చర్చకు, ఆలోచనలకు, మార్గదర్శకత్వానికి దోహదపడతాయని తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు రాజ్యాంగం, న్యాయస్థానాల విధులు, చట్టాలపై అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి వేదికగా నిలిచిన ఐఎల్‌పీఏ తెలంగాణ యూనిట్‌ను అభినందించారు. ఐఎల్‌పీఏ జాతీయ అధ్యక్షురాలు కె.సుజాత చౌదంతి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి సరిత, న్యాయమూర్తులు కిరణ్‌కుమార్, కవిత, రాజేందర్, సుచరిత, రవికుమార్, వినయ్‌కుమార్, సూరిరెడ్డి, ఎం.రాజమల్లు, కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ, ఐఎల్‌పీఏ బాధ్యులు శాంసన్, దేవరాజ్ గౌడ్, లక్ష్మీదేవి, నాగేందర్, అదనం ఖమర్ పాల్గొన్నారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్


