జాతీయస్థాయి పోటీలకు ఎంపిక
సూపర్‌బజార్(కొత్తగూడెం): ఈనెల 18 నుంచి 20వ తేదీ వరకు హనుమకొండ జేఎన్‌ఎస్ స్టేడియంలో నిర్వహించిన ఎస్‌జీఎఫ్ రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీల్లో ఉమ్మడి జిల్లా క్రీడాకారులు ప్రతిభ చాటి రెండు స్వర్ణ, ఒక రజత పతకాలు సాధించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జితేష్ వి పాటిల్ శనివారం విజేతలను అభినందించి సర్టిఫికెట్లు అందజేశారు. అంతేకాక ఈ నెల 25 నుంచి జనవరి 1 వరకు మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్‌లో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న ఆర్.గణేష్, మణికంఠ, వి సాయికిరణ్‌ను అభినందించారు. జాతీయ పోటీలకు సిద్ధం కావడానికి అవసరమైన సామగ్రి అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి పరంధామరెడ్డి, ఎస్‌జీఎఫ్ అసోసియేషన్ సెక్రటరీ వాసిరెడ్డి నరేష్,, తిరుమలరావు, బాక్సింగ్ కోచ్ శ్రీనివాస్, మట్టపర్తి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు..
పాల్వంచరూరల్ : కిన్నెరసాని మోడల్ స్పోర్ట్స్ స్కూల్‌కు చెందిన ముగ్గురు విద్యార్థులు జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికై నట్లు కోచ్ వాసు తెలిపారు. ఇటీవల పెద్దపల్లిలో జరిగిన రాష్ట్రస్థాయి ఎస్‌జీఎఫ్ పోటీల్లో ప్రతిభ చాటిన బొర్ర లోకేష్, కె.వెంకన్నబాబు అండర్ – 14 విభాగంలో జనవరిలో హిమచల్‌ప్రదేశ్‌లో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారని వివరించారు. ఖమ్మంలో జరిగిన రాష్ట్రస్థాయి బీచ్ వాలీబాల్ పోటీల్లో ప్రతిభ చూపిన వై.రుషీవర్మ గోవాలో జరిగే జాతీయ పోటీలకు ఎంపికయ్యాడని పేర్కొన్నారు.


