ముక్కోటికి రండి
భధ్రాచలం : భద్రాచలంలో ఈ నెల 29,30వ తేదీల్లో జరిగే తెప్పోత్సవం, ఉత్తర ద్వార దర్శనానికి హాజరు కావాలంటూ ఆలయ ఈఓ దామోదర్‌రావు శనివారం ఖమ్మం క్యాంపు కార్యాలయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఆహ్వాన పత్రిక అందించారు. ఈ సందర్భంగా అర్చకులు వేదాశీర్వచనం చేసి స్వామి వారి ప్రసాదాలను అందజేశారు. ముక్కోటి ఏర్పాట్ల వివరాలను ఈఓ మంత్రికి వివరించారు. అనంతరం తుమ్మల మాట్లాడుతూ.. ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు సంప్రదాయయుతంగా, శాస్త్రోక్తంగా, భక్తుల మనోభావాలను గౌరవిస్తూ ఘనంగా నిర్వహించాలని సూచించారు. ఉత్సవాల సమయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని, దర్శన సౌకర్యాలు, శాంతి భద్రతలు, తాగునీరు, వైద్య సదుపాయాల వంటివాటిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. అలాగే భధ్రాచలం మాజీ ఎమ్మెల్యే, అటవీశాఖ కార్పొరేషన్ ఛైర్మన్ పొదెం వీరయ్యకు భద్రాచలంలోని ఆయన గృహంలో ఆహ్వాన పత్రిక అందజేశారు. కార్యక్రమంలో ప్రధానార్చకులు విజయరాఘవన్, ఏఈఓ భవానీ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
మంత్రి తుమ్మలకు అర్చకులు, ఈఓ ఆహ్వానం


