లక్ష్మీదేవిపల్లి విభిన్నం..
● ఓ వైపు పంచాయతీ, మరోవైపు మున్సిపాలిటీ
పాల్వంచరూరల్: మండలంలోని లక్ష్మీదేవిపల్లి గ్రామ పంచాయతీ (ఎస్) బీసీయం జాతీయ రహదారి వైపు ఉంటుంది. ఇందులో కొంత మున్సిపాలిటీ పరిధిలో విస్తరించి ఉంది. పంచాయతీ సర్పంచ్ స్థానం ఎస్టీ మహిళకు రిజర్వు చేశారు. గతంలో పంచాయతీ సర్పంచ్‌గా పనిచేసిన భూక్యా విజయ్‌కుమార్ భార్య మంజులను ఈసారి బరిలోకి దింపారు. కాంగ్రెస్ అభ్యర్థి కూడా పోటీలో ఉండటంతో ఇక్కడ ద్విముఖ పోటీ ఉంటుంది. మొత్తం 1,056 మంది ఓటర్లు ఉండగా 514 మంది పురుషులు, 542 మహిళా ఓటర్లు ఉన్నారు. 8 వార్డుల్లో ఒకటో వార్డు ఎస్టీ జనరల్, 2వ వార్డు ఎస్టీ మహిళ, 3, 4 వార్డులు జనరల్ మహిళ, 5వ వార్డు ఎస్టీ మహిళ, 6, 7, జనరల్, 8వ వార్డు ఎస్టీ జనరల్‌కు రిజర్వు అయ్యాయి. కాగా, లక్ష్మీదేవిపల్లి గ్రామ పంచాయతీని మున్సిపాలిటీలోకి విలీనం చేయాల ని స్థానికులు పలుసార్లు అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవించారు. గెలిపిస్తే మోడల్ పంచాయతీగా అభివృద్ధి చేస్తామని బరిలో ఉన్న ఇద్దరు సర్పంచ్ అభ్యర్థులు హామీలిస్తున్నారు.


