‘చేతి’లో చర్ల సర్పంచ్ స్థానం..
చర్ల: చర్ల గ్రామ పంచాయతీలో హోరాహోరీగా సాగిన ఎన్నికలో సర్పంచ్ స్థానాన్ని కాంగ్రెస్ కై వసం చేసుకుంది. కాంగ్రెస్ తరఫున బరిలో నిలిచిన పూజారి సామ్రాజ్యం సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. సర్పంచ్ స్థానానికి కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీఎస్‌పీతో పాటు బీజేపీ నుంచి అభ్యర్థులు పోటీ పడ్డారు. గురువారం అర్ధరాత్రి వరకు లెక్కింపు కొనసాగింది. 16 వార్డుల్లో కాంగ్రెస్ 6, బీఆర్‌ఎస్ 4, సీపీఎం3, ఇతరులు 3 వార్డులను దక్కించుకున్నారు. కాగా, ఇతరుల మద్దతుతో కాంగ్రెస్ వార్డు సభ్యుడు కాపుల కృష్ణార్జున్‌రావును ఉప సర్పంచ్‌గా ఎన్నుకున్నారు.
సర్పంచ్‌గా పూజారి సామ్రాజ్యం,
ఉప సర్పంచ్‌గా కాపుల కృష్ణార్జున్‌రావు


