రెండు మేజర్ జీపీలు హస్తగతం..
బూర్గంపాడు: గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో సారపాక, బూర్గంపాడు మేజర్ గ్రామపంచాయతీల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. సారపాక ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం వరకు కొనసాగింది. సర్పంచ్‌గా కాంగ్రెస్ బలపరిచిన గుగులోత్ కిశోర్‌శివరామ్‌నాయక్ 2,998 ఓట్ల మెజారిటీతో, బూర్గంపాడు సర్పంచ్‌గా కాంగ్రెస్ బలపరిచిన మందా నాగరాజు 571 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మండలంలోని 18 గ్రామ పంచాయతీల్లో 5 ఏకగ్రీవం కాగా.. ఎన్నికలు జరిగిన 13 జీపీల్లో 8 కాంగ్రెస్, 5 బీఆర్‌ఎస్ దక్కించుకున్నాయి.


