తేమ తగ్గేలా..!
ఇటీవల మోంథా తుపాను.. ఆ ప్రభావం తగ్గినా నిత్యం ఏదో ఒక సమయంలో కురుస్తున్న వర్షాలు.. ఈ పరిస్థితుల్లో పంటలను ఆరబెట్టడం రైతులకు సవాల్‌గా మారుతోంది. ఏ పంట అమ్మాలన్నా వ్యాపారులు ‘తేమ శాతం’ కొర్రీలతో ధర తగ్గిస్తున్నారు. ఈ క్రమంలో అశ్వారావుపేట మండలం సూర్యంపేట గ్రామానికి చెందిన ఓ గిరిజన రైతు.. రెండెకరాల్లో సాగు చేసిన మినుము పంట ఇటీవల చేతికందగా.. ఆరబెట్టేందుకు సరైన ఎండ రావడం లేదు. అప్పుడప్పుడు వచ్చినా, బయట ఆరబోస్తే మళ్లీ ఎప్పుడు వర్షం పడేది తెలియడం లేదు. దీంతో ఇంట్లోనే ఆరబోసి రెండు ఫ్యాన్‌లు ఏర్పాటు చేశాడు. వాటి గాలికి మినుములు త్వరగా ఆరి, తేమ శాతం తగ్గేలా ఇలా వినూత్న ఆలోచన చేశాడు. – అశ్వారావుపేటరూరల్


