దివ్యాంగులను గౌరవించాలి
కొత్తగూడెంటౌన్: దివ్యాంగులను ప్రతి ఒక్కరూ గౌరవించాలని, అన్ని రంగాల్లో ప్రోత్సహించాలని ఎస్పీ రోహిత్‌రాజు అన్నారు. సోమవారం తన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన.. ఫిజికల్లీ హ్యాండీకాప్డ్ వెల్పేర్ సొసైటీ ఆధ్వర్యంలో దివ్యాంగుల చట్టం –2016 పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. దివ్యాంగుల చట్టంపై త్వరలో అధికారులతో కలిసి అవగాహన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. దివ్యాంగులను కించపరిచినా, హేళన చేసినా, అవయవ లోపాలను ఎత్తిచూపినా శిక్షార్హులని పేర్కొన్నారు. దివ్యాంగులను అవమానించినా, పరికరాలు ధ్వంసం చేసినా ఆరు నెలల నుంచి రెండేళ్ల పాటు జైలుశిక్ష, రూ. పది వేల నుంచి రూ.5 లక్షల జరిమానా ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో సొసైటీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఊటుకూరి సాయిరాం, అన్నం సత్తిబాబు, సభ్యులు కృష్ణా శ్రీనివాసరావు, వాల్మీకి, అలవాల రాజా పెరియార్, కొమ్మగిరి వెంకటేశ్వర్లు, అప్పన్నదాసు బాబు, మద్దెల లక్ష్మయ్య పాల్గొన్నారు.
ఎస్పీ రోహిత్‌రాజు


