సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు
సూపర్‌బజార్(కొత్తగూడెం): ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకుంటామని కొత్తగూడెం ఆర్డీఓ మధు అన్నారు. తన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఆయన దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వివిధ సమస్యలపై 30 మంది దరఖాస్తులు అందజేశారని, ప్రధానంగా భూ సమస్యలు, ఇందిరమ్మ ఇళ్లపై దరఖాస్తులు వచ్చాయని వివరించారు. కాగా జూలూరుపాడు మండలం కొమ్ముగూడెం, కొత్తగూడెం రామవరంలో ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో అవకతవకలు జరిగాయని సీపీఎం, సీపీఐ నాయకులు ఫిర్యాదు చేశారు.
యువకుడి ఆత్మహత్య
గుండాల: ఒంటరి తనాన్ని భరించలేక మద్యానికి బానిసై మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని పడుగోనిగూడెం గ్రామానికి చెందిన వూకె నిఖిల్(25) చిన్నతనంలో తల్లిదండ్రులు మృతిచెందారు. దీంతో బంధువుల ఇంట్లో ఉంటున్నా.. ఒంటరివాడినని మథన పడేవాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసయ్యా డు. మనస్తాపానికి గురై వారం క్రితం పురుగుమందు తాగగా, ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతి చెందాడు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సైదా రహూఫ్ తెలిపారు.
సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు


