ఆధ్యాత్మికశోభ
మృత్యుంజయస్వామివారి ఆలయంలో కార్తీక సందడి
నెలరోజులపాటు అభిషేకాలు,
ప్రత్యేక పూజా కార్యక్రమాలు
కాశీ తరహాలో వైభవోపేతంగా
గంగాహారతి
అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు
అన్నపురెడ్డిపల్లిలో
చారిత్రక నేపథ్యం..
కాకతీయ సేనానిగా పనిచేసిన అన్నపురెడ్డి దట్టమైన అడవుల్లో శ్రీ వేంకటేశుడి ఆలయాన్ని నిర్మించాడు. కాలక్రమంలో ఆలయం చుట్టూ జనావాసాలు ఏర్పడగా, అన్నపురెడ్డిపల్లి పేరుతో గ్రామం ఆవిర్భవించింది. 1970వ దశకంలో నాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ప్రత్యేక చొరవతో నాలుగు ప్రాకారాలు, మండపం నిర్మించి అభివృద్ధి చేశారు. ఆ తర్వాత శ్రీనివాసుడు కొలువైన గ్రామంలో శివాలయం కూడా నిర్మించాలని దేవాదాయ శాఖ అధికారులు భావించారు. శ్రీ వేంకటేశ్వర దేవస్థాన భూముల్లో పనులు మొదలుపెట్టారు. గర్భాలయం వరకు నిర్మించాక పనులు నిలిచిపోయాయి. ముప్‌పై ఏళ్లపాటు కేవలం గర్భాలయం మాత్రమే ఉండగా, చలువ పందిర్లు వేసి, శివకల్యాణం చేసే వారు. అటుపిమ్మట గ్రామానికి చెందిన విద్యావేత్త మారగాని శ్రీనివాసరావు ఆలయ నిర్మాణానికి శ్రీకా రం చుట్టారు. ఆరేళ్లపాటు శ్రమించి శివలింగాకారంలో, 108 శివలింగాలతో కోవెలను పూర్తి చేశారు. 20 ఎకరాల సువిశాల ప్రాంగణంలో శివపార్వతులు, నంది, భక్తకన్నప్ప, మార్కండేయులు, దక్షిణామూర్తి, భారీ వాయలింగం విగ్రహాలతో పాటు, కోనేరు నిర్మించారు. భక్తులకు వసతిగదులను కూడా ఏర్పాటు చేశారు.
కనుల పండువగా కార్తీక మాసోత్సవాలు
ఆలయంలో ప్రతీయేటా కార్తీక మాసోత్సవాలను కనుల పండువగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా ఉత్సవాలు నిర్వహించేందుకు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో కరపత్రాలతో విస్తృత ప్రచారం చేశారు. ఈ క్రమంలో ఈ నెల 22న విఘ్నేశ్వర పూజ, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, ఆకాశ దీపారాధనతో మాసోత్సవాలు ప్రారంభమాయ్య యి. శనివారం నాగులచవితి సందర్భంగా ఆలయ పరిసరాల్లో పుట్టల వద్ద మహిళలు పూజలు చేశారు. నవంబరు 30 వరకు విశేష పూజాధికాలు జరుపనున్నారు. నవంబర్ 1న ఏకాదశి అన్నాభిషేకం, 5న కార్తీకపౌర్ణమిని పురస్కరించుకొని కృత్తికా దీపోత్సవం, జ్వాల తోరణం, కోనేటి హారతి, గంగాహారతిని అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు. 8న లక్ష బిల్వార్చన, 14న సామూహిక కుంకుమార్చనలు, 17న సందీశ్వరుని అభిషేకం, 18న శివపార్వతుల కల్యాణ మహోత్సవ వేడుక, 20న మాసోత్సవాల ముగింపు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. భారీగా భక్తులు హాజరుకానుండగా ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ మేనేజర్ పీవీ రమణ తెలిపారు.
ప్రముఖ శైవక్షేత్రంగా విరాజిల్లుతున్న అన్నపురెడ్డిపల్లి భ్రమరాంబ సమేత మల్లికార్జున (మృత్యుంజయ) స్వామివారి ఆలయం ఆధ్యాత్మికశోభ సంతరించుకుంటోంది. కార్తీక మాసం ప్రారంభం కావడంతో నెలరోజులపాటు ప్రత్యేక పూజలతో సందడి నెలకొంది. పరమశివునికి ప్రీతిపాత్రమైన మాసంలో వేకువ జామునే మహిళలు కార్తీక దీపాలు వెలిగించనుండగా, సోమ, శుక్రవారాల్లో ఆలయ ప్రాంగణం రద్దీగా మారనుంది.
– ములకలపల్లి (అన్నపురెడ్డిపల్లి)
కార్తీకమాసం కావడంతో నిత్యం పూజాధికాలు, అభిషేకాలు ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నాం. వేడుకలపై ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పర్యవేక్షణలో విస్తృతంగా ప్రచారం నిర్వహించాం. భక్తులకు అసౌకర్యం కలుగకుండా భారీగా ఏర్పాట్లు చేశాం.
– మల్లెల నర్సింహారావు, ఆలయ చైర్మన్
ఆధ్యాత్మికశోభ
ఆధ్యాత్మికశోభ
ఆధ్యాత్మికశోభ
ఆధ్యాత్మికశోభ


