రామయ్యకు సువర్ణ పుష్పార్చన
భద్రాచలం: భద్రాచల శ్రీ సీతారామ చంద్రస్వామివారిదేవస్థానంలోని మూలమూర్తులకు ఆది వారం అభిషేకం, సువర్ణపుష్పార్చన జరిపారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాతసేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలుచేశారు. అనంతరంనిత్యకల్యా ణానికి బేడామండపంలో కొలువుదీరిన స్వామి వారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశా రు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టా న్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. నిత్యకల్యాణంలో పాల్గొన్న భక్తులు స్వామి వారిని దర్శించుకుని ప్రసాదాలను స్వీకరించారు.
ఉపాధ్యాయులపై
పీఓ ఆగ్రహం
దుమ్ముగూడెం: ఉద్దీపకం టు వర్క్ బుక్ నిర్వహణ సక్రమంగాలేకపోవడంతో ఉపాధ్యాయులపై భద్రాచలం ఐటీడీఏ పీఓ బి.రాహుల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. పిల్లలు పదాలు తప్పులు లేకుండా సక్రమంగా రాసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శనివారం మండలంలోని పెద్దనల్లబల్లి, గడ్డోరు గట్ట గిరిజన సంక్షేమశాఖ పాఠశాలలో తనిఖీచేశారు. పిల్లల సామర్థ్యాలను పరీక్షించి, రా యడం, చదవడంలో వెనుకబడిఉన్నారని గ్రహిం చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చిన్నారులు కనీసం తెలుగు, ఇంగ్లిష్‌లో తమపేర్లు రాసుకోలేని పరిస్థితి ఉందని అన్నారు. ఎస్సీఆర్పీల పర్యవేక్షణ సక్రమంగా ఉండాలని అన్నారు. టీచర్లు ఇకనైనా దృష్టిపెట్టాలని హెచ్చరించారు.
రామయ్యకు సువర్ణ పుష్పార్చన


