పకడ్బందీగా ఎస్‌ఐఆర్ జాబితా
సూపర్‌బజార్(కొత్తగూడెం)/భద్రాచలంటౌన్: ఎస్‌ఐఆర్ ఓటర్ జాబితా పకడ్బందీగా తయారు చేస్తామని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి పి.సుదర్శన్‌రెడ్డి శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లాలో నుంచి కలెక్టర్‌తోపాటు ఐటీడీఏ పీఓ, అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్‌ఐఆర్ మ్యాపింగ్‌లో భాగంగా కేటగిరీ ’ఏ’ ని బీఎల్‌ఓ యాప్ ద్వారా ఽధ్రువీకరిస్తామని, కేటగిరీ సీ, డీ లింక్ ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు. ఈఆర్‌ఓ కార్యాలయంలో ఇద్దరు బూత్‌స్థాయి అధికారులను ప్రత్యేకంగా కేటాయించి వచ్చే శనివారం నాటికి మ్యాపింగ్ పూర్తి చేస్తామన్నారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కాశయ్య, ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ రంగా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ జితేష్ వి.పాటిల్
పకడ్బందీగా ఎస్‌ఐఆర్ జాబితా


