
కేటీఆర్ పర్యటన విజయవంతం చేయండి
సూపర్‌బజార్(కొత్తగూడెం)/అశ్వారావుపేటరూరల్ : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెప్టెంబర్ 10, 11 తేదీల్లో జిల్లాలో పర్యటించనున్నారని, ఆయన పర్యటనను విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు శ్రేణులకు పిలుపునిచ్చారు. కొత్తగూడెం, అశ్వారావుపేటలో శనివారం నిర్వహించిన కార్యకర్తల సమావేశాల్లో ఆయన మాట్లాడారు. కేటీఆర్ పర్యటనతో జిల్లాలో పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నారు. జిల్లాలో ముగ్గురు మంత్రులున్నా రైతులకు సరిపడా యూరియా అందించలేకపోతున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో ఎప్పుడూ ఎరువుల కొరత రాలేదని, విద్యుత్ కోతలు లేవని అన్నారు. కేసీఆర్ పాలనలో 30 జిల్లాలకు 30 మెడికల్ కళాశాలలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాలను ఏర్పాటు చేసిందని, కాంగ్రెస్ హయాంలో ఆయా స్కూళ్లలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం కూడా అందించడం లేదని విమర్శించారు. ఆయా సమావేశాల్లో మాజీ ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, మెచ్చా నాగేశ్వరరావు, కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ కాపు సీతాలక్ష్మి, మాజీ ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి, సోయం లక్ష్మి, మందపాటి మోహన్‌రెడ్డి, యూఎస్ ప్రకాశ్‌రావు, సున్నం నాగమణి, వగ్గెల పూజ, సంకా ప్రసాద్, సంపూర్ణ, కాసాని చంద్రం, వెంకన్న, నారం రాజశేఖర్ పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా