నిబంధనలకు విరుద్ధంగా విత్తనాల విక్రయం
చండ్రుగొండ: నిబంధనలకు విరుద్ధంగా మిరప, పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ఐదుగురు వ్యాపారులను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. జూ లూరుపాడు సీఐ ఇంద్రసేనారెడ్డి కథనం ప్రకారం... సుజాతనగర్‌కు చెందిన డీలర్‌కు చండ్రుగొండ మండలంలో విక్రయించే అనుమతి లేనప్పటికీ బెండాలపాడులో విత్తనాలు విక్రయిస్తున్నాడు. దీంతో పోలీసులు దాడి చేశారు. పది కిలోల మిరప విత్తనాలను, 105 పత్తి విత్తన పాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ. 12,73,250 ఉంటుంది. ఈ ఘటనలో బెండాలపాడుకు చెందిన వీరభద్రం, అన్వేష్‌లతోపాటు సుజాతనగర్‌కు చెందిన శివనాగ్, సాయిదుర్గప్రసాద్, యోగానంద్‌లను అరెస్ట్ చేసి, కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ఈ సమావేశంలో ఎస్‌ఐ శివరామకృష్ణ, ఏఓ వినయ్ పాల్గొన్నారు.
ఐదుగురు వ్యాపారుల అరెస్ట్


