అన్నయ్య సైకిలెక్కి వెళ్లేవాడిని..
ఇల్లెందు: మా అన్నయ్య, అక్కయ్య తోడుగా ఉండడంతో పాశాలలకు వెళ్లడానికి భయపడే పరిస్థితి రాలేదు. స్వగ్రామమైన ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్‌నగర్ ప్రభుత్వ పాఠశాలలో 1 – 10వ తరగతి వరకు చదివా. నాన్న సాయిలు అటెండర్, అమ్మ సుశీల గృహిణి. అక్క జయ, అన్న విజయ్‌కుమార్‌తో కలిసి స్కూల్‌కు వెళ్లేవాడిని. మా అన్నయ్య సైకిల్‌పై తీసుకెళ్లేవాడు. మూడో తరగతి తర్వాత స్నేహితులు, టీచర్లు గుర్తు ఉన్నారు. మా స్కూల్ రోజుల్లో విరామ సమయాన సత్తుపిండి పెట్టేవాళ్లు. టెన్త్ వరకు యూనిఫాం, షూ లేవు. పాఠశాలల్లోనూ విద్యుత్, తాగునీరు, మరుగు దొడ్లు ఉండేవి కావు. ఇప్పుడు పాఠశాలల్లో సకల సదుపాయాలు ఉన్నందున విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటే ఉన్నత స్థాయికి చేరొచ్చు. నేను డిగ్రీ వరంగల్‌లో చదవగా ఓ సదస్సుకు హాజరైన ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ ఉపన్యాసంతో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యా. ఓయూలో పీజీ పూర్తి చేశాక 2009లో గ్రూప్ పరీక్షలకు సిద్ధమవుతూ తొలుత ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌గా, ఆ తర్వాత కమర్షియల్ ట్యాక్స్ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగానికి ఎంపికయ్యా. 2012లో మళ్లీ గ్రూప్ – 2 రాసి మున్సిపల్ కమిషనర్‌గా ఎంపికయ్యాను.
– సీహెచ్ శ్రీకాంత్ ,
ఇల్లెందు మున్సిపల్ కమిషనర్
అన్నయ్య సైకిలెక్కి వెళ్లేవాడిని..


