ఆయిల్‌పామ్‌తో అదనపు ఆదాయం
అశ్వారావుపేటరూరల్: దీర్ఘకాలిక పంటగా పేరున్న ఆయిల్‌పామ్‌లో అంతర పంటల సాగు, కుటీర పరిశ్రమల ఏర్పాటుతో అదనపు ఆదాయానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీంతో కొంతకాలంగా ఆయిల్‌పామ్ సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. జిల్లాలో ప్రస్తుతం 75, 049 ఎకరాల్లో ఈ పంట సాగులో ఉండగా అందులో 63 వేల ఎకరాల్లో అంతర పంటలు సాగు చేస్తుండడం విశేషం.
సాగునీరు, శ్రమ ఆదా..
ఆయిల్‌పామ్ తోటల్లో అంతర పంటల సాగుతో అధిక ఆదాయం వస్తుంది. ఎకరం తోటలో 59 పామాయిల్ మొక్కలు నాటితే వాటి మధ్య ఖాళీ ప్రదేశం ఎక్కువగా ఉంటుంది. ఆ స్థలంలో తొలి నాలుగేళ్ల పాటు మొక్కజొన్న, వేరుశనగ, పుచ్చ, బొబ్బర్లు, పత్తి, అరటితో పాటు బీర, దోస, చిక్కుడు, సొరకాయ, బెండ వంటి కూరగాయలు, బంతి, చామంతి వంటి పూలసాగు కూడా చేస్తూ ఆదాయం గడించవచ్చు. దీంతో ఎరువుల ఖర్చు కలిసొస్తుంది. డ్రిప్ ద్వారా ఏక కాలంలో ఆయిల్‌పామ్, అంతర పంటలకు సాగునీరు అందించడం ద్వారా నీరు, శ్రమ కూడా తగ్గుతాయి. ఐదేళ్లకు పామాయిల్ మొక్కలు పెరిగాక కూడా అంతర పంటలుగా కోకో, వక్క, జాజికాయ పంటలు సాగు చేయొచ్చు. పెట్టుబడి ఖర్చులన్నీ మొదటి నాలుగేళ్లలోనే వెనక్కు వచ్చే అవకాశం ఉంటుంది.
కుటీర పరిశ్రమలకూ చాన్స్..
ఆయిల్‌పామ్ గెలల దిగుబడి వచ్చిన తర్వాత కూడా కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఇందులో ప్రధానంగా నాటు కోళ్ల పెంపకం, పాడి పరిశ్రమ, తేనెటీగల పెంపకం, ఫారం కోళ్ల షెడ్లు, వర్మి కంపోస్టు తయారీ యూనిట్ల ద్వారా రూ.లక్షల్లో ఆదాయం గడించే అవకాశం ఉంటుంది.
అంతర పంటలు సాగు చేయండి
ఆయిల్‌పామ్ తోటల్లో తొలి నాలుగేళ్లు, ఆ తర్వాత ఐదేళ్ల తర్వాత కూడా అంతర పంటలు సాగు చేయొచ్చు. ఆయా ప్రాంతాల్లో పండే ఏ రకం పంటలైనా వేసుకోవచ్చు. ఈ అదనపు ఆదాయంతో రైతులు ఆర్థికాభివృద్ధి సాధించే అవకాశం ఉంది. ఉద్యాన పంటలకు ప్రభుత్వం అనేక రాయితీలు, సబ్సిడీలు ఇస్తున్నందున అర్హులైన రైతులు దరఖాస్తు చేసుకుంటే పరిశీలిస్తాం.
– జంగా కిషోర్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి
అంతర పంటల సాగుకు
అనేక అవకాశాలు
కుటీర పరిశ్రమలు సైతం
ఏర్పాటు చేసుకోవచ్చు
నాలుగేళ్లలోనే తీరనున్న
పెట్టుబడి ఖర్చులు
ఆయిల్‌పామ్‌తో అదనపు ఆదాయం
ఆయిల్‌పామ్‌తో అదనపు ఆదాయం


