పల్లెకు కొత్త కళ
గ్రామపంచాయతీల్లో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు
ఇక విడతల వారీగా విడుదలకానున్న కేంద్ర ప్రభుత్వ నిధులు
ఉమ్మడి జిల్లాలో సర్పంచ్‌లు, వార్డు సభ్యుల వివరాలు
ఆదర్శంగా తీద్దిదిద్దుతా
ఏర్పాట్లు పూర్తిచేశాం
చుంచుపల్లి: పల్లెల్లో పాలకవర్గాలు నేడు కొలువుదీరనున్నాయి. ఉమ్మడి జిల్లాలోని 1,033 పంచాయతీలు, 9,304 వార్డులకు ఈ నెల 11,14,17 తేదీల్లో మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించారు. అవే రోజుల్లో ఫలితాలు వెల్లడయ్యాయి. కొత్తగా ఎన్నికై న సర్పంచులు, వార్డు సభ్యులు సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. నూతన పాలకవర్గాలు కొలువుదీరాక గ్రామపాలన గాడిలో పెట్టే అవకాశం ఉంది. రెండేళ్లుగా పంచాయతీలకు పాలకవర్గాలు లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వ నిధులు ఆగిపోయాయి. తాజాగా పాలకవర్గాలు ఏర్పడటంతో ఇక నుంచి విడతల వారీగా నిధులు అందనున్నాయి.
రెండేళ్లపాటు ప్రత్యేకాధికారుల పాలన
గత పాలకవర్గాల గడువు 2024, జనవరి 31తో ముగియగా, ఫిబ్రవరి 2న ప్రత్యేకాధికారుల పాలన విధించారు. దాదాపు రెండేళ్లుగా ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతుండగా, అధికారులు గ్రామాలవైపు కన్నెత్తి చూడలేదనే ఆరోపణలున్నాయి. గ్రామాలకు నియమించిన ప్రత్యేకాధికారులు తమ సొంత శాఖ పనులకే పరిమితమయ్యారు. దీంతో గ్రామ కార్యదర్శులే అన్నీ తామై పాలన సాగించారు. మరోవైపు పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు సకాలంలో అందక గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడింది. చెత్త సేకరణకు వినియోగించే ట్రాక్టర్లకు డీజిల్, మరమ్మతుల కోసం నిధులను కార్యదర్శులు సొంతంగా వెచ్చిస్తున్నారు. కొన్నిచోట్ల మరమ్మతులు చేపట్టకపోవడంతో ట్రాక్టర్లు మూలనపడ్డాయి. వీధి దీపాల నిర్వహణ, పారిశుద్ధ్య పనులు, తాగునీటి వసతుల మరమ్మతులు, పైపులైన్ లీకేజీలు తదితర పనుల నిధుల కొరత ఏర్పడింది. ఆర్థిక సంఘం నిధులు రాకపోవడంతో గ్రామ పంచాయతీల్లో ఆర్థిక సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రజాప్రతినిధులు కూడా లేకపోవడంతో గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఫాగింగ్ యంత్రాలు సైతం నిరుపయోగంగా మారాయి. నేటి నుంచి సర్పంచ్‌లు, వార్డు సభ్యుల పాలన రానుండటంతో సమస్యలన్నీ పరిష్కరించాలని పల్లె ప్రజలు కోరుతున్నారు.
నేడు కొలువుదీరనున్న పాలకవర్గాలు
జిల్లా వార్డుసభ్యులు సర్పంచ్‌లు మహిళలు పురుషులు
ఖమ్మం 5,156 565 297 268
భద్రాద్రి 4,148 468 266 202
మొత్తం 9,304 1,033 563 470
ప్రశాంతినగర్ గ్రామ పంచాయతీని అన్ని విధాలా అభివృద్ధి చేస్తాను. ప్రధానంగా మురుగు కాల్వలు, పారిశుద్ధ్య పనులపై ఎప్పటికప్పుడు దృష్టి పెడతాను. గ్రామంలో అందరి సహకారంలో సమస్యల పరిష్కారంతో పాటు గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తాను.
అజ్మీర లైల, ప్రశాంతి నగర్ సర్పంచ్
జిల్లాలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కొత్తగా ఎన్నికై న పాలకవర్గాల ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేశాం. సోమవారం అన్ని గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌లు, వార్డు సభ్యులతో కార్యదర్శులు ప్రమాణ స్వీకారం చేయిస్తారు.
– సుధీర్‌కుమార్,
జిల్లా పంచాయతీ అధికారి
పల్లెకు కొత్త కళ
పల్లెకు కొత్త కళ
పల్లెకు కొత్త కళ


