జాతీయ లోక్ అదాలత్‌కు విశేష స్పందన
సూపర్‌బజార్(కొత్తగూడెం): జాతీయ లోక్ అదాలత్‌కు అనూహ్య స్పందన లభించిందని, ఆదివారం జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో 7,233 కేసులు పరిష్కారమయ్యాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ అన్నారు. ఈ సందర్భంగా కక్షిదారులతో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో న్యాయమూర్తి మాట్లాడుతూ రాజీమార్గమే రాజమార్గమని, చిన్న తగాదాలను లోక్ అదాలత్‌లో పరిష్కరించుకుని స్నేహ పూర్వక వాతావరణంలో ఉండాలని కక్షిదారులకు సూచించారు. కొత్తగూడెంలో 3,990, ఇల్లెందులో 614, భద్రాచలంలో 1,400, మణుగూరులో 1,229 కేసులు పరిష్కారమైనట్లు తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.రాజేందర్ మాట్లాడుతూ లోక్ అదాలత్ కేసు పరిష్కారమై అవార్డు పాస్ చేస్తే అది అంతిమ తీర్పు అవుతుందన్నారు. కక్షిదారులకు పులిహోర, మంచినీటి సదుపాయాన్ని ఎస్‌బీఐ సౌజన్యంతో కల్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి కె.కిరణ్ కుమార్, మెజిస్ట్రేట్‌లు సుచరిత, రవికుమార్, వినయ్ కుమార్, మెండు రాజమల్లు, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెలగల నాగిరెడ్డి, బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు జె గోపికృష్ణ, డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెనన్స్ కౌన్సిల్ పీ నిరంజన్‌రావు, ఆర్ రామారావు, ఎస్‌బీఐ బ్యాంకు అధికారులు, పోలీసు అధికారులు, కక్షిదారులు పాల్గొన్నారు.


