శ్రీకనక దుర్గమ్మతల్లికి విశేష పూజలు
పాల్వంచరూరల్: శ్రీకనకదుర్గమ్మతల్లికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి)ఆలయానికి ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. తలనీలాలు సమర్పించుకున్నారు. ఒడిబియ్యం, చీరలు, కుంకుమ, పసుపు, గాజులు అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించారు. అర్చకులు అభిషేకం జరిపారు. ఈఓ ఎన్.రజనీకుమారి, ఆలయ కమిటీ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, డైరెక్టర్లు పాల్గొన్నారు.
సైక్లింగ్‌తో ఫిట్‌నెస్
జిల్లా యువజన క్రీడల శాఖాధికారి
పరంధామ రెడ్డి
సూపర్‌బజార్(కొత్తగూడెం): ఫిట్‌నెస్‌కు సైక్లింగ్ ఉత్తమ మార్గమని జిల్లా యువజన, క్రీడల శాఖాధికారి పరంధామ రెడ్డి అన్నారు. ఆదివారం కొత్తగూడెం పట్టణంలో సండే సైక్లింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అమలవుతున్న ఫిట్ ఇండియా మిషన్ కార్యక్రమంలో భాగంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో ‘ఫిట్ ఇండియా–సండే సైక్లింగ్’’కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి విద్యార్థులు సైక్లింగ్‌లో పాల్గొన్నారని అన్నారు. ఎస్‌జీఎఫ్ సెక్రటరీ నరేష్, సైక్లింగ్ అసోసియేషన్ సెక్రటరీ బీవీజీ కృష్ణ, నాగేశ్వరరావు, ఉదయ్ కుమార్, ఫిజికల్ డైరెక్టర్లు కవిత, శైలజ పాల్గొన్నారు.
నేడు గిరిజన దర్బార్
భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించనున్న గిరిజన దర్బార్ కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు సకాలంలో హాజరుకావాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే దర్బార్‌లో గిరిజనులు తమ సమస్యలపై అర్జీలను అందజేయాలని కోరారు.
కిన్నెరసానిలో
పర్యాటక సందడి
పాల్వంచరూరల్: కిన్నెరసానిలో ఆదివారం ప ర్యాటకులు సందడి చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. డ్యామ్, జలాశయం, డీర్ పా ర్కులోని దుప్పులను వీక్షించారు. 330 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా వైల్డ్‌లైఫ్ శాఖకు రూ.22,730 ఆదాయం లభించింది. 260మంది బోటు షికారు చేయగా టూరిజం కార్పొరేషన్‌కు రూ.13,190 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఓఎస్‌డీ అవినాశ్ కుమార్ కుటుంబీకులతో కలిసి కిన్నెరసానిని సందర్శించారు. జలాశయంలో బోటు షికారు చేశారు. ఎస్‌ఐ సురేష్ ఉన్నారు.
శ్రీకనక దుర్గమ్మతల్లికి విశేష పూజలు
శ్రీకనక దుర్గమ్మతల్లికి విశేష పూజలు


