పొగాకు క్యూరింగ్‌లో మార్పులు రావాలి
అశ్వారావుపేటరూరల్: పొగాకు పంట క్యూరింగ్‌లో విప్లవాత్మక మార్పులు రావాలని, రైతులు గ్యాస్ ఆధారిత క్యూరింగ్ విధానానికి మారాలని ఐసీఏఆర్–ఎన్‌ఐఆర్‌సీఏ డైరెక్టర్ డాక్టర్ మాగంటి శేషు మాధవ్ అన్నారు. శనివారం అశ్వారావుపేట మండల పరిధిలోని తిమ్మాపురంలో రైతు కొడవాటి వాసు వ్యవసాయ క్షేత్రంలో ఐసీఎఆర్–ఎన్‌ఐఆర్‌సీఏ, ఎల్‌ఓసీఎల్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన గ్యాస్ ఆధారిత పొగాకు బ్యారన్ పనితీరుపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పొగాకు క్యూరింగ్ సమయంలో బ్యారన్లలో వినియోగించే వివిధ రకాల కలపతో కాలుష్యం పెరుగుతోందని, పొగాకులో నాణ్యత తగ్గిపోతోందని తెలిపారు. జనరల్ మేనేజర్ వర్నేకర్, చీఫ్ మేనేజర్ లలిత, పొగాకు బోర్డు విస్తరణ మేనేజర్ సురేఖ, బోర్డు ఆర్‌ఎం ప్రసాద్, ప్రాజెక్టు హెడ్ డాక్టర్ ఎల్‌కే ప్రసాద్, డాక్టర్ ఐవీ సుబ్బయ్య, టి.వెంకటేష్, టి.రమేష్, దేవానంద్, ఆయిల్‌ఫెడ్ డీఓ నాయుడు రాధాకృష్ణ, పామాయిల్ ఫ్యాక్టరీ మేనేజర్ నాగబాబు పాల్గొన్నారు.
ఐసీఏఆర్–ఎన్‌ఐఆర్‌సీఏ
డైరెక్టర్ డాక్టర్ మాగంటి శేషు మాధవ్


