
కాంగ్రెస్‌ను పటిష్టపర్చాల్సి ఉంది..
ఇల్లెందు/మణుగూరుటౌన్: దేశంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనంగా ఉందని, గ్రామస్థాయి నుంచి పటిష్టపర్చాలని, ఇలాంటి తరుణంలో కాంగ్రెస్‌కు పూర్తిస్థాయి కార్యకర్తలు అవసరమని టీపీసీసీ ఉపాధ్యక్షులు డాక్టర్ పి.శ్రావణ్‌కుమార్‌రెడ్డి, ప్రదాన కార్యదర్శి ప్రమోద్‌కుమార్ వెల్లడించారు. మంగళవారం పట్టణంలోని ఐతా ఫంక్షన్ హాల్‌లో డీసీసీ అధ్యక్షులు పొదెం వీరయ్య అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ సంస్థాగత కమిటీల పదవులకు దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడారు. పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని, దేశంలో అధికారం సాధించి, రాహుల్‌ను ప్రధానిని చేసేందుకు ప్రతీ కార్యకర్త పోరాడాలని కోరారు. అందుకోసం ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్‌గౌడ్, సీఎం రేవంత్‌రెడ్డి సూచనలతో గ్రామస్థాయి నుంచి కాంగ్రెస్ పటిష్టం చేయాల్సి ఉందన్నారు. 2017 పూర్వం నుంచి పార్టీ లో ఉన్న వారికి పదవులు వస్తాయని, దరఖాస్తులు పరిశీలిస్తామని చెప్పారు. అనంతరం డీసీసీ అధ్యక్షులు పొదెం వీరయ్య, ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడారు. డానియేల్, పులి సైదులు, దేవానాయక్, రవికుమార్, జిల్లా కిసాన్ కమిటీ అధ్యక్షులు ఏలూరి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కాగా, మణుగూరులోని ఓ ఫంక్షన్ హాల్‌లో మంగళవారం జరిగిన నియోజకవర్గస్థాయి సమావేశానికి డీసీసీ అధ్యక్షుడు పొదెం వీరయ్య, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించగా.. శ్రావణ్‌కుమార్‌రెడ్డి, ప్రమోద్‌కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షులు, ఏ, బీ బ్లాక్ అధ్యక్షుల ఎంపికకు దరఖాస్తులు స్వీకరించారు.
టీపీసీసీ ఉపాధ్యక్షుడు శ్రావణ్‌కుమార్‌రెడ్డి