నల్లగొండ జిల్లా రైతుల క్షేత్ర సందర్శన | - | Sakshi
Sakshi News home page

నల్లగొండ జిల్లా రైతుల క్షేత్ర సందర్శన

May 14 2025 12:14 AM | Updated on May 15 2025 3:14 PM

అశ్వారావుపేటరూరల్‌: నల్లగొండ జిల్లాకు చెందిన రైతుల బృందం మంగళవారం అశ్వారావుపేటలో పర్యటించింది. నాబార్డు, ఇంటిగ్రేటేడ్‌ గ్రామీణాభివృద్ధి సొసైటీ ద్వారా 50 మంది రైతుల బృందం ముందుగా మండలంలోని నారంవారిగూడెం వద్ద గల ఆయిల్‌ఫెడ్‌ కార్యాలయం, నర్సరీలు, పామాయిల్‌ ఫ్యాక్టరీ, పలువురు రైతులకు చెందిన పామాయిల్‌ క్షేత్రాలను సందర్శించారు. అనంతరం స్థానిక వ్యవసాయ కళాశాలను సందర్శించగా, ఆయా రైతులకు కళాశాల శాస్త్రవేత్తలు.. ఆయిల్‌పాంలో నీటి యాజమాన్యం, ఆయిల్‌పాం సాగులో రైతులు పాటించాల్సిన పద్ధతులు, జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమాల్లో కళా శాల శాస్త్రవేత్తలు డాక్టర్‌ నీలిమా, డాక్టర్‌ లక్ష్మ ణ్‌, డాక్టర్‌ చరిత, తేజస్విని, శ్రావిక, అనూష, రైతుల బృందం పాల్గొన్నారు.

రీ వెరిఫికేషన్‌లో అదనపు మార్కులు

కొత్తగూడెంఅర్బన్‌: ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో అత్యధిక మార్కులు సాధించి, రీ వెరిఫికేషన్‌లో మరో రెండు మార్కులు సాధించిన విద్యార్థిని కె.హాసినిని కృష్ణవేణి కళాశాల డైరెక్టర్‌ మాచవరపు కోటేశ్వరరావు అభి నందించారు. మంగళవారం కళాశాలలో జరిగి న కార్యక్రమంలో విద్యార్థినికి పుష్పగుచ్ఛం అందించారు. హాసినికి ఇంటర్మీడియ ట్‌ ద్వి తీయ సంవత్సరంలో 1000 మార్కులకు 994 మార్కులు వచ్చాయని, రీ వెరిఫికేషన్‌లో మరో రెండు మార్కులు రాగా.. మొత్తం 996 మా ర్కులు సాధించిందని చెప్పారు.

స్పీడ్‌బోటు సిద్ధం

పాల్వంచరూరల్‌: కిన్నెరసాని జలాశయంలో టూరిజం డెలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ సంస్థ ఆధ్వర్యంలో నడుపుతున్న బోట్లు మూడు ఆదివారం దెబ్బతిన్న విషయం విదితమే. సదరు బోట్లకు మరమ్మతులు చేసేందుకు హైదరాబాద్‌ నుంచి మెకానిక్‌లు వచ్చారు. స్పీడ్‌ బోటును సిద్ధం చేశారు. పెద్ద బోటుకు సైతం మరమ్మతులు చేపట్టారు.

సరస్వతి నది పుష్కరాలకు ప్రత్యేక బస్సులు

15 నుంచి 26 వరకు సర్వీసులు

ఖమ్మంమయూరిసెంటర్‌: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఈ నెల 15 నుంచి 26వ తేదీ వరకు జరగనున్న పుష్కరాలకు వెళ్లే భక్తుల కోసం ఉమ్మడి జిల్లా నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులు నడిపించనున్నట్లు ఆర్‌సీ ఖమ్మం రీజినల్‌ మేనేజర్‌ ఎ.సరిరామ్‌ తెలిపారు. తొలుత ఖమ్మం, కొత్తగూడెం, మణుగూరు డిపోల నుంచి ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులు నడుపుతామని వెల్లడించారు. ఖమ్మం నుంచి ఉదయం 6 గంటలకు బయలుదేరే సర్వీస్‌ మధ్యాహ్నం 12 గంటలకు కాళేశ్వరం చేరుకోనుండగా, తిరిగి సాయంత్రం 4 గంటలకు అక్కడి నుంచి బయలుదేరుతుందని తెలిపారు. ఇందులో పెద్దలకు రూ.480, పిల్లలకు రూ.260 చార్జీ ఉంటుందని పేర్కొ న్నారు. కొత్తగూడెం నుంచి ఉదయం 6 గంటలకు, కాళేశ్వరం నుంచి సాయంత్రం 4.30 గంటలకు బస్సు బయలుదేరుతుందని, ఇందులో పెద్దలకు రూ.580, పిల్లలకు రూ.300 చార్జీగా నిర్ణయించినట్లు తెలిపారు. అలాగే, మణుగూరులో ఉదయం 6 గంటలకు, తిరిగి కాళేశ్వరం నుంచి 3.30 గంటలకు బస్సు బయలుదేరుతుందన్నారు. కాగా, కాళేశ్వరం పుష్కరాలకు వెళ్లాలనుకునే భక్తులు డిపోల్లో సంప్రదిస్తే బస్సులు ఏర్పాటు చేస్తామని ఆర్‌ఎం తెలిపారు.

రిటైర్డ్‌ ఆర్మీ సుబేదార్‌ మృతి

పాల్వంచ: అనారోగ్య సమస్యలతో రిటైర్డ్‌ ఆర్మీ సుబేదార్‌ తాళ్లూరి జాన్‌రత్నం (80) పట్టణంలోని కాంట్రాక్టర్స్‌కాలనీలోని తన నివాసంలో మంగళవారం మృతి చెందారు. దేశం కో సం అనేక ప్రాంతాల్లో ఆర్మీ లో కీలక విధులు నిర్వహించారు. పంజాబ్‌, జమ్మూకశ్మీర్‌, మీజోరాం, రాజస్థాన్‌, మణిపూర్‌, త్రిపుర వంటి అనేక ప్రాంతాల్లో ఆర్మీలో 30 ఏళ్ల పాటు విధులు నిర్వర్తించి ఉద్యోగ విరమణ పొందారు. అనంతరం పాల్వంచలోని ఎన్‌ఎండీసీ కర్మాగారంలో 9 ఏళ్లపాటు సెక్యూరిటీ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తించారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు కాగా అనిల్‌ అనే కుమారుడు సైతం ఆర్మీలో విధులు నిర్వర్తించి రిటైర్డ్‌ అయ్యారు. జాన్‌రత్నం మృతదేహాన్ని ఆర్మీ రిటైర్డ్‌ ఉద్యోగులు ఎస్‌డీ ఖలీద్‌, భాస్కర్‌రావు, టి.షడ్రక్‌, డీకే ప్రసాద్‌, కె.శేషుబాబు, పట్టణ ప్రముఖులు పలువురు సందర్శించి నివాళులర్పించారు.

నల్లగొండ జిల్లా రైతుల క్షేత్ర సందర్శన1
1/1

నల్లగొండ జిల్లా రైతుల క్షేత్ర సందర్శన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement