
● ప్రభుత్వ పాఠశాలల్లో వేసవి శిబిరాలు ● పలు అంశాలపై చిన్
నేర్పిస్తున్న అంశాలు..
శిబిరాలకు హాజరయ్యే చిన్నారులకు విద్యా శాఖ నిర్దేశించిన విధంగా పలు అంశాలపై ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. 8 గంటలకు యోగా, మెడిటేషన్, ప్రాణాయామంపై తర్ఫీదునిస్తున్నారు. అనంతరం అత్యధికంగా విద్యార్థులకు ఇష్టమైన క్రికెట్ ఆటతోపాటు వి ద్యార్థుల్లో విజ్ఞానం పెంచే చెస్, క్యా రమ్స్, వైకుంఠపాళి వంటి ఆటలపై శిక్షణ ఇస్తున్నారు. ఇంతేకాకుండా చిత్రలేఖనం, మట్టితో, కాగితాలతో బొమ్మల తయారీ, భరతనాట్యం, క్లాసికల్ డాన్స్, మార్షల్ ఆర్ట్స్ వంటి అంశాల్లో శిక్షణ ఇస్తూ మాల్గుడి కథలను చిన్నారులకు వినిపిస్తూ గ్రామీణ జీవన సౌందర్యంపై అవగాహన కల్పిస్తున్నారు. ఇంతేకాకుండా విద్యార్థుల చేత సైన్స్ ప్రయోగాలు చేయిస్తూ సైన్స్ పరికరాలపై అవగాహన కల్పిస్తున్నారు.
ఆసక్తిగా.. ఆలోచింపజేసివిగా..
శిబిరంలో ఆటపాటలతోపాటు విజ్ఞానం పెంచుకునేలా పలు అంశాలపై చిన్నారులకు శిక్షణ ఇస్తున్నా రు. యోగా, మెడిటేషన్ చేయిస్తూ వాటి వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తున్నారు. చెస్, క్యారమ్స్, వైకుంఠపాళి ఆటల్లో పోటీతత్వం అలవడేలా తర్ఫీదు ఇవ్వడం ఆకట్టుకుంటోంది. స్థానికంగా సేకరించిన మట్టి, కాగితాలతో బొమ్మలను తయారు చేయించి వారిలో దాగి ఉన్న కళాత్మక నైపుణ్యాన్ని వెలికితీస్తున్నారు. చివరగా పాఠ శాల ఆవరణలో చిన్నారుల చేత మొక్కలు నాటించి వాటి ఆలనపాలన ఎలా చూడాలో శిక్షణ ఇస్తున్నా రు. తద్వారా ఇంటి పరిసరాల్లో ఖాళీ స్థలాలను ఎలా సద్వినియోగం చేసుకోవాలో అవగాహన కల్పిస్తున్నారు.

● ప్రభుత్వ పాఠశాలల్లో వేసవి శిబిరాలు ● పలు అంశాలపై చిన్