
ఇసుక నిల్వలకు అడ్డాగా గోదావరి వరదకట్ట
సమ్మెకు జాతీయ
కార్మిక సంఘాల మద్దతు
సింగరేణి(కొత్తగూడెం): ఈ నెల 20న జరిగే సమ్మెకు అన్ని జాతీయ కార్మిక సంఘాలు మద్దతు తెలుపుతున్నాయని అఖిల పక్ష నాయకులు పేర్కొన్నారు. సోమవారం రుద్రంపూర్‌లోని ఏఐటీయూసీ కార్యాలయంలో జరిగిన అఖిల పక్ష సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడారు. ఐఎన్‌టీయూసీ, టీబీజీకేఎస్, సీఐటీయూ, ఇఫ్టూ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
చర్ల: గోదావరి కరకట్ట పైనుంచి సాగునీటి కోసం తాము పైపులు ఏర్పాటు చేసుకుంటే అధికారులు అభ్యంతరం వ్యక్తం చేయగా, ఇప్పుడు నది నుంచిడీసిల్టింగ్ పేరిట లక్షలాది క్యూబిక్ మీటర్ల ఇసుకను తీస్తూ కరకట్టపై డంపింగ్ చేస్తుంటే చర్యలు తీసుకోకపోవడంపై రైతులు మండిపడుతున్నారు. మండలంలోని కుదునూరు సమీపానగోదావరి నదిలో ఇటీవల రెండు ఇసుకక్వారీలు ప్రాంభమయ్యాయి. ఒకటి సొసైటీక్వారీ కాగా మరొకటి డీసిల్టింగ్ పేరిటప్రారంభమైంది. ఈ క్వారీల నుంచి పెద్దఎత్తున ఇసుకను భారీ యంత్రాలతో తవ్వుతూఒడ్డుకు చేరుస్తున్నారు. నిల్వ చేయడానికిరైతుల భూములను లీజుకు తీసుకున్నా,గోదావరి వరద కట్టను కూడా యార్డుగామార్చుకుని వందలాది లారీల ఇసుకను నిల్వచేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. రెండేళ్లక్రితం సీతమ్మసాగర్ వరద కరకట్ట పనులు చేపట్టిన సమయంలో కంటెపల్లి, కుదునూరుగ్రామాలకు చెందిన రైతులు గోదావరి నుంచిమోటార్ల ద్వారా పంటలకు నీటి కోసం కరకట్టపైనుంచి తాత్కాలికంగా ప్లాస్టిక్ పైపులు ఏర్పాటుచేస్తే అధికారులు అభ్యంతరం తెలిపారు. కానీ ఇప్పుడు ఇసుక డంప్‌పై పట్టించుకోకపోవడం ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై ఇరిగేషన్ కొత్తగూడెం ఎస్‌ఈ శ్రీనివాసరెడ్డిని వివరణ కోసం ఫోన్‌లో ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.
అధికారుల తీరుపై రైతుల ఆగ్రహం

ఇసుక నిల్వలకు అడ్డాగా గోదావరి వరదకట్ట