
భారజల కర్మాగారంలో మాక్ డ్రిల్
అశ్వాపురం: దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఆదివారం మణుగూరు భారజల కర్మాగారంలో మాక్ డ్రిల్ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మణుగూరు డీఎస్పీ రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ అత్యవసర సమయంలో తీసుకోవాల్సిన రక్షణ చర్యలపై అవగాహన కల్పించేందుకు మాక్‌డ్రిల్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భారజల కర్మాగారం ఉద్యోగుల పని ప్రదేశం, కాలనీలో అలారం సిస్టం వినియోగించినప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలను సిబ్బందికి వివరించారు. ఈ కార్యక్రమంలో సీఐఎస్‌ఎఫ్ కమాండెంట్ అమిత్‌కుమార్, అశ్వాపురం సీఐ అశోక్‌రెడ్డి, ఎస్సై మధుప్రసాద్, సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది, అశ్వాపురం పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
మణుగూరు డీఎస్పీ రవీందర్‌రెడ్డి