జిల్లాకు గోదావరి జలాలు ఇవ్వాలి
జూలూరుపాడు/చండ్రుగొండ: జిల్లాలోని రైతులకు గోదావరి జలాలు ఇచ్చాక మిగులు నీటిని పక్క జిల్లాకు ఇవ్వాలని బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యదర్శి, కేరళ రాష్ట్ర ఇన్‌చార్జి గోలి మధుసూదన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కిసాన్ మోర్చా నాయకులు వినోభానగర్ గ్రామ సమీపంలోని సీతారామ ప్రాజెక్టు కెనాల్‌ను పరిశీలించారు. మద్దుకూరు గ్రామంలో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీతారామ నీళ్లను జిల్లాలోని అన్ని చెరువులను నింపాకే ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లాలన్నారు. సీతారామ ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన రైతులకు గోదావరి జలాలు ఇవ్వకుండా సాగర్ నీళ్లు వస్తున్న కాలువకే మళ్లించడం దుర్మార్గమని విమర్శించారు. అకాలవర్షాలు, గాలిదుమారాలకు పంటలు నష్టపోయిన బాధిత రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. నాయకులు చిలుకూరి రమేష్, చావా కిరణ్ కుమార్, రమేష్, నంబూరి రామలింగేశ్వరరావు, మాదినేని సతీష్, నున్నా రమేష్, సిరిపురపు ప్రసాద్, చంద్రశేఖర్, నల్లమోతు రఘుపతిరావు, జుబ్బురి రమేష్, భోగి కృష్ణ, గుగులోతు రాజేష్, భూక్యా కుమార్, గుగులోతు రాంబాబు పాల్గొన్నారు.


