● బైక్‌ను ఢీ కొట్టిన గుర్తు తెలియని వాహనం ● మృతులు ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా వాసులు
దమ్మపేట: గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టిన ఘటనలో తల్లి, తనయుడు మృత్యు ఒడిలోకి చేరుకున్న ఘటన దమ్మపేట మండలం గాంధీనగరం గ్రామ శివారులో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం ముష్టికుంట్ల గ్రామానికి చెందిన అరిసెపల్లి కృష్ణ(45), తల్లి సరస్వతి(65)తో కలసి ద్విచక్రవాహనంపై అశ్వారావుపేట మండలం నారంవారిగూడెం గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్తున్నారు. ఈ క్రమంలో గాంధీనగర్ గ్రామ సమీపంలో గుర్తు తెలియని వారిని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తల్లీ, కుమారుడు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహలను పోస్టుమార్టం నిమిత్తం అంబులెన్స్‌లో ఆశ్వారావుపేటకు తరలించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై సాయికిషోర్ రెడ్డి తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో తల్లి, తనయుడు మృతి