
మృతి చెందిన గేదెలను చూపిస్తున్న రాములమ్మ
అశ్వారావుపేటరూరల్: విద్యుదాఘాతంతో నాలుగు పాడి గేదెలు మృతి చెందిన ఘటన మండలంలోని సున్నంబట్టిలో చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి వచ్చిన అకాల గాలివానతో విద్యుత్ వైర్లు తెగి కింద పడ్డాయి. కాగా సోమవారం ఉదయం వగ్గెల రాములమ్మకు చెందిన మూడు, మాడి నాగేంద్రరావుకు చెందిన ఒక పాడి గేదె మేత కోసం అటువైపు వెళ్లగా కిందపడిన విద్యుత్ వైర్లు తగిలి షాక్‌తో మృతి చెందాయి. ఒక్కో గేదె విలువ రూ.50 వేల వరకు ఉంటుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మండల పశు వైద్యురాలు స్వప్న ఆధ్వర్యంలో మృతి చెందిన గేదెలకు పోస్టుమార్టం నిర్వహించారు.