
ఖమ్మంసహకారనగర్: ఓటరుగా నమోదు చేసుకుని గుర్తింపు కార్డు (ఎపిక్ కార్డు) ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న వారి నిరీక్షణకు తెరపడనుంది. కొత్త ఓటరుగా నమోదు చేసుకున్న వారిలో కొందరికి ఇప్పటికే కార్డులు ఇంటికి చేరగా.. మిగతా వారికి సైతం పంపించేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఖమ్మం కలెక్టరేట్‌కు చేరిన కార్డులను సిబ్బంది ప్రత్యేక కవర్లలో పెట్టి తపాలా శాఖ ఉద్యోగులకు అందజేస్తున్నారు. అక్కడి నుంచి స్పీడ్ పోస్టులో ఓటర్లకు కార్డులు చేరతాయి. కాగా, ఈ కవర్‌లో ఓటరు గుర్తింపు కార్డుతో పాటు ఓటరు ప్రతిజ్ఞ, ఓటు వేసే వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎన్నికల సంఘం రూపొందించిన కరపత్రాలు కూడా ఉన్నాయి.