
మాట్లాడుతున్న జిల్లా ఎన్నికల అధికారి ప్రియాంక ఆల
సూపర్‌బజార్(కొత్తగూడెం): ఓటరు స్లిప్పుల జారీకి షెడ్యూల్ రూపొందించనున్నటు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ప్రియాంక ఆల తెలిపారు. హైదరాబాద్ నుంచి అదనపు ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా, జిల్లా నుంచి ప్రియాంక పాల్గొని వివరాలు వెల్లడించారు. జిల్లాలో 512 పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌కు ఏర్పాటు చేస్తున్నట్లు తెలి పారు. ఈనెల 16, 17, 18 తేదీల్లో ఓటరు స్లిప్పుల పంపిణీకి నియోజకవర్గాల వారీగా షెడ్యూల్ తయారుచేసినట్లు చెప్పారు. స్లిప్పుల పంపిణీ పర్యవేక్షణకు ప్రత్యేకంగా నోడల్ అధికారిని నియమించామని తెలిపారు. సమావేశంలో వెబ్‌కాస్టింగ్ నోడల్ అధికారి సులోచనారాణి, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు దారా ప్రసాద్, రంగాప్రసాద్, ఈడీఎం విజయసారధి, దిలీప్ పాల్గొన్నారు.
కలెక్టర్‌ను కలిసిన పరిశీలకులు
జిల్లా ఎన్నికల అధికారి ప్రియాంక ఆలను ఎన్నికల సాధారణ పరిశీలకులు కమల్‌కిషోర్, హరికిషోర్, గణేష్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికల నిర్వహణకు చేపట్టిన చర్యలను ప్రియాంక వివరించగా, పోలింగ్ కేంద్రాలలో ఏర్పాట్లను పరిశీలిస్తున్నట్లు వారు చెప్పారు. బుధవారం నామినేషన్లకు ఉపసంహరణకు తుది గడువు ఉన్నందున దాఖలు చేసిన అభ్యర్థుల నుంచి రిటర్నింగ్ అధికారులు డిక్లరేషన్ ఫారం తీసుకుని తెలుగు అక్షరమాల ప్రాతిపదికన బ్యాలెట్ పేపర్ లిస్టు తయారుచేయాలని, స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులు కేటాయించాలని తెలిపారు. సమావేశంలో పినపాక రిటర్నింగ్ అధికారి ప్రతీక్‌జైన్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ఎన్నికల అధికారి ప్రియాంక ఆల
దేశ భవిష్యత్‌కు బాలలే పునాది
దేశ భవిష్యత్తుకు బాలలే పునాదని, వారిని భావి పౌరులుగా తీర్చిదిద్దేలా తల్లిదండ్రులు, గురువులు కృషి చేయాలని కలెక్టర్ ప్రియాంక ఆల అన్నారు. కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన బాలల దినోత్సవంలో నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ తల్లి ఒడి ప్రతి ఒక్కరికీ ప్రథమ బడి అన్నారు. చిన్నతనం నుంచే తల్లిదండ్రులు పిల్లలకు క్రమశిక్షణ, దేశభక్తి పెంపొందించాలని సూచించారు. చదువుతో పాటు ఆటపాటల్లోనూ రాణించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మధుసూదన్‌రాజు, మహిళా శిశు సంక్షేమ శాఖాధికారి విజేత, డీపీఆర్‌ఓ శ్రీనివాస్, డీఐఈఓ సులోచనారాణి, డీఈఓ వెంకటాచారి పాల్గొన్నారు.